బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు అంటే భారీ బడ్జెట్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. మొదటి సినిమా నుండి ఇదే పంధాలో సినిమాలను చేస్తూ వస్తున్న బెల్లంకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ లు ఎలా ఉంటున్నా కానీ భారీ బడ్జెట్ మూవీస్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తూ ఉన్నాడు. కానీ వాటిలో ఏవి కూడా సక్సెస్ అవ్వక పోవడం తో మధ్యలో కొన్ని చిన్న సినిమాలు తీసినా అవి ఏమాత్రం ఆడియన్స్ నోటిస్ కు కూడా రాలేదు.
దాంతో రీమేక్ రూపంలో ఒక మీడియం బడ్జెట్ లో రాక్షసుడు సినిమా తో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న బెల్లంకొండ తిరిగి కమర్షియల్ భాటలో భారీ బడ్జెట్ తో అల్లుడు అదుర్స్ సినిమా తీశాడు. ఈ సంక్రాంతికి బరిలో సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఏమంత ఆశ జనకమైన..
కలెక్షన్స్ ని సాధించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల బడింది. కానీ ఈ సినిమా బడ్జెట్ అండ్ టోటల్ బిజినెస్ ఒకింత షాక్ కి గురి చేసేలా ఉన్నాయని చెప్పాలి. ఇన్ని ఫ్లాప్స్ పడుతున్న బెల్లంకొండ మీద ఎందుకుని ఇన్ని కోట్ల బడ్జెట్ పెడుతున్నారనేది టోటల్ బిజినెస్ లెక్కలను గమనిస్తే తెలుస్తుంది.
ఈ సినిమా ఓవరాల్ గా బడ్జెట్ 32 కోట్ల రేంజ్ లో రూపొందింది అని సమాచారం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ 9.4 కోట్ల వరకు చేసిన ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ బిజినెస్ 7 కోట్లు, హిందీ శాటిలైట్ రైట్స్ 10 కోట్లు మరియు డిజిటల్ రైట్స్ కింద 4 కోట్ల రేటుని సొంతం చేసుకోగా, మ్యూజిక్ మరియు ఇతర రైట్స్ కలిపి 70 లక్షల వరకు బిజినెస్ ను సొంతం చేసుకుందట. దాంతో ఇవన్నీ కలిపితే….
31 కోట్లకు పైగా టోటల్ బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుంది….అంటే బడ్జెట్ కి 99% రిటర్న్ వచ్చింది.. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎక్కువ కలెక్షన్స్ ని సాధిస్తే… పంచుకోవాలని అనుకున్నారు కానీ అది జరగలేదు, అయినా కానీ సినిమా కి మైనర్ నష్టాలే వచ్చాయి. అందుకే బెల్లంకొండ మీద ఇంత బిజినెస్ పెడుతున్నారు అనేది ఇండస్ట్రీ లో స్ట్రాంగ్ న్యూస్…