Home న్యూస్ అల్లుడు అదుర్స్ బిజినెస్…మెంటల్ మాస్ అంతే!!

అల్లుడు అదుర్స్ బిజినెస్…మెంటల్ మాస్ అంతే!!

0

కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్లకి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి విజయాన్ని నమోదు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సాధించిన విజయం తర్వాత చేస్తున్న సినిమా అల్లుడు అదుర్స్… చాలా సైలెంట్ గా షూటింగ్ ను జరుపుకున్న ఈ సినిమా కొన్ని రోజుల ముందు వరకు కేవలం పోస్టర్స్ తోనే అందరికీ పరిచయం తప్పితే సినిమా షూటింగ్ అప్ డేట్స్ కానీ ఎప్పుడు రానుంది లాంటి అప్ డేట్స్…

ఏవి కూడా రాలేదు. కానీ సడెన్ గా అందరికీ షాక్ ఇస్తూ సంక్రాంతి రేసు లో ఎంటర్ అయిన సినిమా 15 న కానీ లేదా 14 న కానీ ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందా అని ఇప్పుడు అందరూ…

ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సడెన్ గా రేసు లోకి ఎంటర్ అయినా కానీ సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో షాకింగ్ బిజినెస్ జరిగింది అని చెప్పాలి. సినిమా కి నైజాం ఏరియాలో 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, సీడెడ్ ఏరియాలో 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక సినిమా టోటల్ ఆంధ్రాలో 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. కొన్ని ఏరియాలలో ఓన్ రిలీజ్ కూడా ఉందని సమాచారం. దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 11.5 కోట్ల రేంజ్ లో షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంక్రాంతి రేసులో అన్ని సినిమాల కన్నా లేట్ గా వస్తున్న సినిమా ఎంతవరకు ఈ టార్గెట్ ని అందుకుంటుంది అనేది ఆసక్తి కరం. రీసెంట్ గానే మొదటి హిట్ కొట్టాడు కాబట్టి ఈ సినిమా కూడా మరో విజయం సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సినిమా పై మాత్రం బెల్లంకొండ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నానని ఆల్ రెడీ చెప్పిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here