ఎవ్వరూ ఊహించని విధంగా సడెన్ గా సంక్రాంతి రేసులో ఎంటర్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు 15 న రిలీజ్ అనుకున్నా తర్వాత సడెన్ గా డేట్ ముందుకు జరిపి 14 న రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఇక సినిమా ప్రీమియర్ షోలను కూడా పూర్తీ చేసుకుని మొదటి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. ఆ టాక్ ఎలా ఉందో చూద్దాం పదండీ..
కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకపోయినా కానీ ప్రేమ అంటే పట్టని హీరో అనుకోకుండా ఒక అమ్మాయిని చూడటం ప్రేమించడం జరుగుతుంది, కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి… ఒక దెయ్యం ఎంటర్ అవ్వడం తో కాంచన లెవల్ లో…
కామెడీ తో సినిమా సాగుతుందని అంటున్నారు. సినిమా లో బెల్లంకొండ శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉందని కానీ నటన పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక సోనూ సూద్ ఉన్నంతలో తన రోల్ వరకు…
మెప్పించగా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ లో నబా నటేష్ అలాగే అను ఎమాన్యుఎల్ ల పెర్ఫార్మెన్స్ కూడా మెప్పిస్తుందని అంటున్నారు. మిగిలియ యాక్టర్స్ చాలామంది ఉండగా అందరూ ఆకట్టుకున్నారని, సాంగ్స్ పెద్దగా ఇంప్రెస్ చేయకున్నా ఒకటి రెండు పాటలు ఆకట్టుకున్నయని అంటున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా లౌడ్ గా అనిపించింది అంటున్నారు.
సినిమా కథ మొత్తం మీద కందిరీగ ను అలాగే కాంచన సినిమాను మిక్స్ చేసి తెరకెక్కించి నట్లు అనిపించింది అంటున్నారు. ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ సాగిన కథ సెకెండ్ ఆఫ్ కాంచన టచ్ తో అక్కడక్కడా మంచి కామెడీ సీన్స్ తో పర్వాలేదు అనిపించు కుందని అంటున్నారు.
మొత్తం మీద రొటీన్ కమర్షియల్ వెరీ సింపుల్ కథ తో తెరకెక్కిన ప్రిడిక్టబుల్ మూవీ అల్లుడు అదుర్స్ అని అంటున్నారు. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం తో సినిమా మొత్తం మీద పర్వాలేదు అనిపించే లెవల్ లో ఉందని అంటున్నారు. ఫైనల్ గా సినిమా కి వస్తున్న టాక్ మాత్రం…
యావరేజ్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు. కథ పాయింట్ ని పట్టించుకోకుండా ఎంటర్ టైన్ మెంట్ వే లో చూస్తె సినిమా ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంది అంటున్నారు. ఇదీ మొత్తం మీద సినిమా ప్రీమియర్స్ షో టాక్. ఇక రెగ్యులర్ షోల టైం కి సినిమా ఫైనల్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి మరి…