బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని విధంగా సంక్రాంతి రేసులో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్, కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్లకు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా సూపర్ హిట్ తర్వాత చేసిన కమర్షియల్ మూవీ అల్లుడు అదుర్స్ సినిమా సడెన్ గా సంక్రాంతి రేసులో ఎంటర్ అవ్వడం, రెడ్ రిలీజ్ రోజునే రిలీజ్ అవ్వడం జరిగింది కానీ..
సినిమా కి ఏమంత ఆశాజనకంగా టాక్ రాలేదు, దాంతో మొదటి వీకెండ్ వరకు ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా తర్వాత ఏ దశలో కూడా టార్గెట్ ని అందుకునే దిశగా అడుగులు గట్టిగా వేయలేదు కానీ మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ బాగా రావడం తో బిజినెస్ లో…
ఎక్కువ మొత్తం రికవరీ అయింది, అదే సినిమా కి ఫైనల్ రన్ లో కొంచం కలిసి వచ్చింది, దాంతో మరీ డిసాస్టర్ అవ్వాల్సిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఆల్ మోస్ట్ 79% టార్గెట్ ని రికవరీ చేసి మొత్తం మీద యావరేజ్ గా పరుగును ముగించింది ఈ సినిమా..
సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఏరియాల వారిగా ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.23Cr
👉Ceeded: 1.43Cr
👉UA: 1.55Cr
👉East: 60L
👉West: 54L
👉Guntur: 59L
👉Krishna: 34L
👉Nellore: 27L
AP-TG Total:- 7.55CR (12.60Cr Gross~)
KA+ROI: 18L
OS: 5L
Total:- 7.78Cr(13.30Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్. సినిమాను టోటల్ గా 9.4 కోట్ల రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. పరుగు పూర్తీ అయ్యే టైం కి సినిమా టోటల్ గా…
7.78 కోట్లు కలెక్ట్ చేయగా బిజినెస్ లో 79% రికవరీ చేసి యావరేజ్ గా పరుగును ముగించింది. సినిమా తో బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు తర్వాత మరో ఫ్లాఫ్ పడకుండా సేఫ్ అయ్యాడు. ఇక తన అప్ కమింగ్ ఏకంగా ఛత్రపతి హిందీ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న బెల్లంకొండ ఎంతవరకు ఆకట్టుకోగలుగుతాడో చూడాలి ఇక…