కెరీర్ ని 2014 లోనే మొదలు పెట్టినా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి క్లీన్ విజయాన్ని 5 ఏళ్ల తర్వాత సొంతం చేసుకున్న హీరో బెల్లం కొండ శ్రీనివాస్… రాక్షుసుడు సినిమా తో తొలి హిట్ ని సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా ఇచ్చిన విజయాన్ని వృధా చేయకూడదని తన అప్ కమింగ్ మూవీస్ విషయం లో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. రాక్షసుడు టైం లోనే మొదలు పెట్టిన మరో సినిమా….
అల్లుడు అదుర్స్ కొన్ని కారణాల వల్ల షూటింగ్ డిలే అవ్వగా సినిమా మరింత భాగం షూటింగ్ లాక్ డౌన్ టైం కి బాలెన్స్ ఉండగా త్వరలోనే మళ్ళీ షూటింగ్ కి వెళ్ళబోతుంది. కాగా రీసెంట్ గా టీం కలిసి సినిమా ఇప్పటి వరకు చేసిన షూటింగ్ తాలుకూ…
రషెస్ ని కంప్లీట్ గా చూసుకోగా ఎక్కడో కొద్దిగా తేడా కొట్టిందని సమాచారం… కొన్ని సన్నివేశాలు ఏమాత్రం బాలేవని టీం ఫీల్ అయ్యి కొన్ని మార్పులు చేర్పులు అవసరం అని, అలాగే కొన్ని రీ షూట్లు కూడా అవసరం అన్న నిర్ణయం తీసుకున్నారని వార్తలు ప్రచారం లో ఉన్నాయి.
దాంతో కొంచం బడ్జెట్ పెరిగినా పర్వాలేదు కానీ త్వరలోనే మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళాక రీ షూట్లు చేయాలనీ డిసైడ్ అయ్యారని అంటున్నారు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ రభస తో డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్న తర్వాత భారీ గ్యాప్ తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉంటుందని అంటున్నారు.
రీషూట్ కి బడ్జెట్ పెరిగినా ఫస్ట్ టైం క్లీన్ హిట్ కొట్టిన జోరు మీదున్న బెల్లంకొండ ఈ సారి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటే ఈ సినిమా కూడా విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారట. ఇక సినిమా కి డిజిటల్ రిలీజ్ ఆఫర్లు కూడా వస్తున్నా ఫస్ట్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి తర్వాత పరిస్థితిని బట్టే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట టీం….