నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సంక్రాంతి బరిలో మిగిలిన సినిమాల కన్నా ముందు రిలీజ్ అయ్యి మినిమం 3 స్టార్ రేటింగ్ తో పాజిటివ్ టాక్ నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా తొలిరోజు మాత్రమె మినిమం కలెక్షన్స్ తో రన్ అయిన ఈ సినిమా తర్వాత ఎ దశ లోను బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్షన్స్ ని…
కూడా అందుకోలేక పోయిన విషయం తెలిసిందే, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలు ముగిసే సమయానికి టోటల్ గా 19.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా మూడో వారం లో కూడా ఏమాత్రం గ్రోత్ చూపలేక పోయిన ఈ సినిమా ఓవరాల్ గా..
ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్లు దాటి కొన్ని లక్షలు మాత్రమె వసూల్ చేయగలిగింది, ఆశ్యర్యంగా సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ షాక్ ఇచ్చే కలెక్షన్స్ నే అందుకుని అక్కడ కూడా భారీ నష్టాలనే మిగిలించ బోతుంది. ఓవరాల్ గా సినిమా బిజినెస్…
70.5 కోట్లు అవ్వడం తో సినిమా టోటల్ రన్ లో 20.5 కోట్లు కూడా అందుకోలేని పరిస్థితి లో ఉండటం తో తెలుగు సినిమా చరిత్ర లోనే ఏకంగా 50 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించిన అతికొద్ది సినిమాల జాబితా లో ఈ సినిమా కూడా ఒకటిగా చేరడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది.
దాంతో రెండో పార్ట్ ని ఫ్రీ గా ఇచ్చేయాలని నిర్ణయం నిర్మాతలు తీసుకోగా ఇప్పటికీ ఓవర్సీస్ అగ్రిమెంట్స్ జరగగా రెండు రాష్ట్రాలలో చర్చలు జరుగుతున్నాయి. దాంతో ఇప్పుడు రెండో పార్ట్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ 50 కోట్లు కానుంది, మొదటి పార్ట్ నష్టాన్ని రెండో పార్ట్ బర్తీ చేస్తుందా లేదా అన్నది ఆసక్తి గా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.