Home న్యూస్ వినయ విధేయ రామ డే 12, ఎన్టీఆర్ కథానాయకుడు డే 14, F2 డే 11...

వినయ విధేయ రామ డే 12, ఎన్టీఆర్ కథానాయకుడు డే 14, F2 డే 11 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

0

    సంక్రాంతి సీజన్ లో ముగిసిన తర్వాత తొలి అఫీషియల్ వర్కింగ్ డే లో F2 మాత్రమే మంచి వసూళ్ళతో హోల్డ్ చేసి లాంగ్ రన్ ని కన్ఫాం చేసుకోగా మిగిలిన సినిమాలు మాత్రం పెద్దగా జోరు చూపలేక మినిమమ్ హోల్డ్ లేక బాక్స్ ఆఫీస్ ఫైనల్ రన్ త్వరలోనే కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. ఇక మూడు సినిమాల్లో వినయ విధేయ రామ 11 రోజుల్లో 61.5 కోట్ల షేర్ మార్క్ ని, ఎన్టీఆర్ కథానాయకుడు 20 కోట్ల మార్క్ కి చేరువగాను,

F2 సినిమా 58 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దూసుకు పోతూ రెండో వర్కింగ్ డే అయిన మంగళవారం లో ఎలా హోల్డ్ చేశాయో తెలుసుకుందాం. ముందుగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా బాక్స్ ఆఫీస్ పరుగు ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిందనే చెప్పాలి.

సినిమా కలెక్షన్స్ లేక పాత సినిమాలను తిరిగి థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు, దాంతో 14 వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 లక్షల లోపు షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మెగా పవర్ స్టార్…

రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ పండగ సెలవుల్లో జోరు చూపి తర్వాత స్లో డౌన్ అయ్యి ఇప్పుడు పరుగును ముగించే దిశగా అడుగులు వేస్తుంది, సినిమా 12 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది.

ఇక బాక్స్ ఆఫీస్ సంక్రాంతి విన్నర్ F2 11 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్బ్ గా హోల్డ్ చేసి 2 కోట్ల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే విధంగా దుమ్ము లేపే రేంజ్ లో కుమ్మేసింది. సినిమా జోరు ఇలాగే ఈ వీక్ మొత్తం కొనసాగిస్తే మరిన్ని అద్బుతాలు నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here