మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ లాంటి హిట్ తర్వాత వరుస పరజాయలతో ఉన్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు శ్రీనువైట్ల కూడా బాద్ షా తర్వాత హిట్ ట్రాక్ ఎక్కనే లేదు. మొత్తం మీద ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల మీద నమ్మకం తో వీరి కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ అంటోని సినిమాను భారీ రేట్లకి కొన్నారు. సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోల ని కంప్లీట్ చేసుకుంది.
అక్కడ నుండి సినిమా కి వస్తున్న టాక్ ని ఒకసారి గమనిస్తే…స్టొరీ లైన్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ ఇది రివెంజ్ స్టొరీ అని అంటున్నారు. హీరో హీరోయిన్స్ ఇద్దరి కి విలన్ పై రివెంజ్ ఉంటుందని అది ఎలా తీర్చుకున్నారు అన్నది స్టొరీ లైన్ అని అంటున్నారు.
మరి ఇందులో రవితేజ ఒక్కరా లేక ముగ్గురా అన్న సస్పెన్స్ మాత్రం థియేటర్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు. వరుస పరాజయాలతో ఉన్న శ్రీనువైట్ల కొత్త కథ ని కాకుండా మళ్ళీ రివెంజ్ స్టొరీ నే ఎంచుకున్న అందులో చెప్పిన పాయింట్ కొంత కొత్తగా ఉంటుంది అంటున్నారు.
ఇక మొదటి అర్ధభాగం కొంత కామెడి సీన్స్ తో అలరించినా ఓవరాల్ గా యావరేజ్ ఫస్టాఫ్ అంటున్నారు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది అంటున్నారు. దాంతో సెకెండ్ ఆఫ్ పై ఆసక్తి పెరిగినా అక్కడ కూడా రొటీన్ కామెడి తో నెట్టుకు వచ్చే ప్రయత్నం చేసిన శ్రీను వైట్ల…
కొన్ని సీన్స్ వరకు మెప్పించినా ఓవరాల్ గా సినిమా పరంగా యావరేజ్ కంటెంట్ నే ఇచ్చాడు అంటున్నారు. సినిమాలో రవితేజ పెర్ఫార్మెన్స్, రవితేజ ఇలియానా ల కెమిస్ట్రీ, కొన్ని కామెడి సన్నివేశాలు, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలెట్స్ అని అంటున్నారు.
రొటీన్ కథ, వీక్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మైనస్ పాయింట్స్ అని అంటున్నారు. కానీ రవితేజ కోసం ఒకసారి చూడొచ్చు అంటున్నారు. రొటీన్ కమర్షియల్ మూవీస్ కి ఓవర్సీస్ లో ఈ టాక్ కామన్ అనే చెప్పాలి. రెగ్యులర్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.