Home న్యూస్ అమర్ అక్బర్ ఆంటోని టీసర్ రివ్యూ…కుమ్మింది బాస్

అమర్ అక్బర్ ఆంటోని టీసర్ రివ్యూ…కుమ్మింది బాస్

0

  మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చినా తర్వాత చేసిన సినిమాలు ఒక్కోటిగా ఫ్లాఫ్ గా మిగిలిపోయాయి. ఇక దర్శకుడిగా టాప్ రేంజ్ కి ఎదిగిన తర్వాత వరుస ఫ్లాఫులతో పూర్తిగా డౌన్ ఫాల్ అయిన శ్రీనువైట్ల తన కెరీర్ లో రవితేజ తో భారీ హిట్లు కొట్టాడు. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో అమర్ అక్బర్ ఆంటోని అంటూ డిఫెరెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకు నవంబర్ 16 న రాబోతుంది…

కాగా ఈ సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. శ్రీనువైట్ల రీసెంట్ మూవీస్ కి పూర్తి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ లుక్స్ రీసెంట్ మూవీస్ లో లాగే ఉండటం కొంచం మైనస్ అయినప్పటికీ పలు గెటప్స్ లో ఆకట్టుకున్నాడు రవితేజ.

టేకింగ్ అండ్ విజువల్స్ టీసర్ లో హైలెట్స్ కాగా సీరియస్ గా ఉందేంటి అనుకుంటున్న సమయంలో చివర్లో రవితేజ రిలాక్స్ అంటూ కామిక్ టైమింగ్ తో చెప్పడంతో సినిమాలో శ్రీనువైట్ల మార్క్ కామెడీ కూడా ఉండటం ఖాయమని చెప్పొచ్చు. టోటల్ గా టీసర్ ఫ్రెష్ కంటెంట్ తో కుమ్మింది అనే చెప్పాలి. మీరు టీసర్ చూసి ఎలా అనిపించిందో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here