బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమా బజ్ ఉన్నా నార్మల్ బిజినెస్ నే సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించింది. ఆ సినిమా తో పోల్చితే బజ్ పరంగా ఏమాత్రం బుకింగ్స్ లో జోరు చూపించ లేక పోయిన కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అమిగోస్ సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఇప్పుడు….
ఆడియన్స్ ముందుకు రాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నిరాశ కలిగించే విధంగా ఉండటంతో టాక్ ఇప్పుడు కీలకంగా మారగా ఈ లో బుకింగ్స్ కి మేకర్స్ తీసుకున్న నిర్ణయం కూడా ఒక కారణం అని చెప్పాలి. అసలే సినిమాకి మినిమమ్ బజ్ లేదని తెలిసి కూడా…
సినిమాకి నార్మల్ టికెట్ రేట్స్ పెట్టాల్సింది, టికెట్ హైక్స్ తో సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, నైజాంలో సింగిల్ స్క్రీన్స్ లో 175 టికెట్ రేటు ఉండగా మల్టీ ప్లెక్సులలో 250 వరకు టికెట్ రేటు ఉంది… ఇక ఆంధ్రలో సినిమా కి యావరేజ్ గా…
177, 147 టికెట్ రేట్స్ ఉన్నాయి…. సినిమా పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడితే ఇలా టికెట్ హైక్స్ పెట్టినా ఉపయోగం ఉంటుంది కానీ ఇలా బజ్ లేక పోయినా టికెట్ హైక్స్ పెట్టడం ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేట్స్ తో ఎలా ఓపెన్ అవుతుందో చూడాలి.