Home న్యూస్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ రివ్యూ…పారిపోండిరోయ్!

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ రివ్యూ…పారిపోండిరోయ్!

0

       

బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్ మరియు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్. అత్యంత భారీ ఎత్తున ఇండియా లో 5000 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా 7000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సెన్సేషనల్ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలిస్తే ఒకింత షాక్ కలగక మానదు.

కథ విషయానికి వస్తే 1852 లో బ్రిటిష్ వారు ఇండియా ని తమ గుప్పట్లో పెట్టుకోగా వాళ్ళని ఎదిరించి నిలిచిన మొదటి వ్యక్తి ఆజాద్ ని ఎలాగైనా అడ్డుకోవాలని హీరో కి ఆ పనిని అప్పగిస్తారు, మరి హీరో ఆజాద్ ని అడ్డుకున్నాడా లేక తిరిగి బ్రిటిష్ వారి పైనే దండెట్టాదా అన్నది మిగిలిన కథ.

ఇలాంటి స్టోరీ లైన్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు అన్నీ భాషల్లో వచ్చాయి. కానీ ఇలాంటి సినిమాలకు కథ ఎంత బలంగా ఉండాలో స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ కూడా అంతే బలంగా ఉండాలి. కానీ ఈ సినిమా లో కథ బలంగా లేదు అలా అని స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోలేదు.

ప్రతీ సీన్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టె విధంగా ఉందని చెప్పాలి. మొదటి అర్ధభాగం 20 నిమిషాల తర్వాతే సినిమా ఫేట్ ఏంటో అర్ధం అయిపోతుంది. దాంతో అప్పటి నుండి తర్వాత సీన్ ఏమవుతుంది అన్న ఆసక్తి కన్నా సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్న ఆతృతే ఎక్కువగా ఉంటుంది.

కొన్నేళ్లుగా బాలీవుడ్ లో వరుస విజయాలతో సినిమా సినిమా కి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ ఇండియన్ మార్కెట్ ని వరల్డ్ వైడ్ గా పెంచిన అమీర్ ఖాన్ నుండి ఇది ఊహించని సినిమా అని ట్రైలర్ రిలీజ్ రోజే అందరికీ దాదాపుగా అర్ధం అయింది.

దానికి తోడు హాలీవుడ్ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ని కాపీ కొట్టినట్లు క్యారెక్టర్స్ ఉండటం తో ఆ సినిమాలు చూసినవాళ్లు కంపేర్ చేయడం తో మరింత మైనస్ గా మారింది. ఓవరాల్ గా గత 15 ఏళ్లలో మంగల్ పాండే తర్వాత మళ్ళీ అంతటి వీక్ మూవీ ఇదే అని చెప్పాలి.

నటన పరంగా అమీర్ ఖాన్ రోల్ ఏమాత్రం ఆకట్టు కోలేదు. నటన కూడా పాత మూవీస్ లో లాగా సహజంగా అనిపించలేదు. ఇక అమితాబ్ రోల్ బాగున్నా సినిమా ని సేఫ్ చేసే లెవల్ లో లేదు. ఇక కత్రినా కైఫ్ మరియు ఫాతిమా సనా ఖాన్ ల రోల్స్ కూడా ఆకట్టుకోలేదు.

మొత్తం మీద సినిమా 2 గంటల 44 నిమిషాల పూర్తి నిరాశాని మిగిలించిన సినిమా అని చెప్పాలి. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 1.5 స్టార్స్…అమీర్ ఖాన్ స్టార్ పవర్ తో సినిమా ఎంత వరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here