Home న్యూస్ సర్కార్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్..హ్యూమంగస్!

సర్కార్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్..హ్యూమంగస్!

0

  ఏ.ఆర్. మురగదాస్ మరియు ఇళయ ధలపతి విజయ్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అఫీషియల్ లెక్కల ప్రకారం 36.2 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 66 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని సంచలన ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ డే 1 సౌత్ రికార్డు లను అందుకున్న సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు టోటల్ గా 40 కోట్ల దాకా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందట. షేర్ సుమారు 20 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 రోజుల్లో 56 కోట్లకు పైగా షేర్ ని 106 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకుంది.

ఇక ఇందులో తెలుగు వర్షన్ కలెక్షన్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి. మొదటి రోజు సినిమా 2.5 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు సాలిడ్ గా 1.8 కోట్ల షేర్ ని అందుకుందట. దాంతో తెలుగు లో షేర్ 4.3 కోట్ల దాకా ఉంది. ఇంకా సినిమా 4.2 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here