Home న్యూస్ ఒకప్పుడు 6 హిట్స్ కొట్టిన హీరో…ఇప్పుడు 2 కోట్లు ఏంటి సామి!!

ఒకప్పుడు 6 హిట్స్ కొట్టిన హీరో…ఇప్పుడు 2 కోట్లు ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అని చెప్పాలి. ఒకప్పుడు వరుస పెట్టి హిట్స్ కొట్టిన హీరో నుండి వరుస పెట్టి డిసాస్టర్లు వస్తున్నా కానీ మినిమమ్ ఓపెనింగ్స్ అయినా కొత్త సినిమాకి వస్తాయి అనుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ టాక్ తో కూడా డిసాస్టరస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ చూసి టోటల్ ఇండస్ట్రీ షాకులో ఉందని చెప్పాలి…

ఆ హీరోనే ఆయుష్మాన్ ఖురానా… బాక్స్ అఫీస్ దగ్గర ప్రీ పాండమిక్ ముందు బరిలీకి బర్ఫీ, శుబ్ మంగళ్ సావ్దాన్, అంధదూన్, బదాయిహో, ఆర్టికల్ 15 మరియు డ్రీమ్ గర్ల్ లాంటి బాక్ టు బాక్ సూపర్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్న ఈ హీరో…

రీసెంట్ టైం లో నటించిన సినిమాలు అన్నీ కూడా తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా నటించిన ఎన్ యాక్షన్ హీరో అనే సినిమా డీసెంట్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ మొదటి రోజు టోటల్ ఇండియాలో కేవలం 1.4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

2 రోజులు కలిపి టోటల్ గా 2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించింది. ఈ కలెక్షన్స్ చూసి టోటల్ బాలీవుడ్ మైండ్ బ్లాంక్ అవ్వగా ఇంత తక్కువ కలెక్షన్స్ ఏంటి సామి అని అంటున్నారు. ఒక్క దృశ్యం2 తప్పితే రీసెంట్ మూవీస్ అన్నీ కూడా తీవ్రంగానే అక్కడ నిరాశ పరుస్తూ ఉండటం విచారకరం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here