Home గాసిప్స్ సెకెండ్ వేవ్ లో ఫస్ట్ మూవీ…చిన్న సినిమానే…మంచి రేటు వచ్చింది!

సెకెండ్ వేవ్ లో ఫస్ట్ మూవీ…చిన్న సినిమానే…మంచి రేటు వచ్చింది!

0

లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ తగ్గింది, ఇక సినిమాలు అన్నీ కూడా థియేటర్స్ లోనే క్రమం తప్పకుండా రిలీజ్ అవుతూ వస్తుండటం తో వచ్చే ఏడాది వరకు వరుస పెట్టి సినిమాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తూ ఫుల్ జోష్ చూపెట్టారు టాలీవుడ్ వాళ్ళు. ఏకంగా వచ్చే సంక్రాంతి దాకా టాలీవుడ్ ఫుల్ బిజీగా ఉండబోతుంది అని అంతా అనుకున్నారు కానీ సడెన్ గా సెకెండ్ వేవ్ ఊహకందని స్పీడ్ తో…

వచ్చి అది పీక్స్ కి చేరింది, దాంతో ఆ ఇంపాక్ట్ అందరిపై కూడా తీవ్రంగా పడింది. దాంతో సినిమాల రిలీజ్ లు అన్నీ ఆపేశారు. కొత్త సినిమాలు థియేటర్స్ లో రావడం లేదు. దాంతో మళ్ళీ డైరెక్ట్ రిలీజ్ ల ప్రపోజల్స్ మొదలు అయ్యాయి. లాస్ట్ ఇయర్ జూన్ నుండి మొదలు అయిన…

డైరెక్ట్ రిలీజ్ ల గోల ఇయర్ ఎండ్ వరకు అలానే కొనసాగింది. కానీ ఇప్పుడు సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ మూత బడ్డ కొన్ని రోజులకే పరిస్థితులను అర్ధం చేసుకుని చిన్న సినిమాలు డిజిటల్ రిలీజ్ కి సిద్దం అవ్వగా అందులో భాగంగా….

సెకెండ్ వేవ్ లో ఫస్ట్ మూవీ గా అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు బ్రదర్ సినిమాను ఆహా యాప్ లో మే 7 న డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారు. దాంతో సెకెండ్ వేవ్ లో డిజిటల్ రిలీజ్ కానున్న మొదటి సినిమాగా ఈ సినిమా నిలిచింది, ఇక డైరెక్ట్ రిలీజ్ కోసం ఈ సినిమా మంచి రేటునే ఇచ్చారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

చిన్న సినిమా అవ్వడం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా 1.2 కోట్ల లోపు బిజినెస్ చేసే చాన్స్ ఉన్న ఈ సినిమా 1.8 కోట్ల రేటు తో డిజిటల్ రిలీజ్ కి ఒప్పించారట. వ్యూస్ ఎక్కువ వస్తే తర్వాత నెల వారిగా ప్రాఫిట్స్ ను కూడా షేర్ చేయబోతున్నారని సమాచారం. ఇక సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన మరిన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ కి రెడీ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here