Home న్యూస్ యానిమల్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

యానిమల్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మోస్ట్ హైప్ మూవీ యానిమల్(Animal Movie) వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది, ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న సినిమా అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది, ఒకసారి ఆ టాక్ ను గమనిస్తే…

పూర్తి కథని రివీల్ చేయకున్నా కూడా తండ్రిని ఎక్కువగా ప్రేమించే హీరో తండ్రికి ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది కథ పాయింట్, కథ టేక్ ఆఫ్ అవ్వడం ఎక్స్ లెంట్ గా స్టార్ట్ అవ్వగా ఫస్టాఫ్ లో హై ఇచ్చే మూమెంట్స్ తో నిండిపోగా ఇంటర్వెల్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉందని అంటున్నారు.

ఫస్టాఫ్ ఓవరాల్ గా టికెట్ రేటుకి వర్త్ అనిపించేలా మెప్పించిన తర్వాత సెకెండ్ ఆఫ్ లో కథ కూడా అదే ఫ్లోలో వెళ్ళినా కూడా అవే సీన్స్ రిపీట్ అయినట్లు అనిపించడం, సెకెండ్ ఆఫ్ లెంత్ కూడా పెరిగి పోయి ఒక స్టేజ్ లో కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసినా తిరిగి క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా మెప్పించడంతో…

ఓవరాల్ గా సినిమా బాగుంది అనిపించేలా ముగుస్తుందని అంటున్నారు, రణబీర్ కపూర్(Ranbir Kapoor) కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేశాడు అని అంటున్నారు, ఇక సినిమాలో పాటలు అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బిగ్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. ఓవరాల్ గా లెంత్ కొంచం ఎక్కువ అయినా కూడా….

యానిమల్ మూవీ చాలా వరకు ఆడియన్స్ అంచనాలను అందుకునే విధంగా ఉంటుందని అంటున్నారు, ఓవరాల్ గా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఎబో యావరేజ్ టు హిట్ మధ్యలో అయితే టాక్ సినిమాకి వినిపిస్తుంది అని చెప్పాలి. ఇక సినిమా రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకుంటే ఇక్కడ దుమ్ము దుమారం లేపడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here