లాస్ట్ ఇయర్ బ్రహ్మాస్త్ర(Brahmastra 1) తో తెలుగు లో కూడా దుమ్ము లేపాడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) ఈ ఇయర్ తూ జూటీ మే మక్కార్ అంటూ హిందీలో హిట్ కొట్టగా ఇప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న యానిమల్(Animal Movie) తో రచ్చ లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా…
సినిమా డిసెంబర్1న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా తెలుగు లో కూడా సినిమాను డబ్ చేసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు…. కాగా తెలుగు లో ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉండగా బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా కుమ్మేస్తూ దూసుకు పోతుంది…
ఒక్క కోస్టల్ ఆంధ్ర ఏరియాలోనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కొన్ని డబ్బింగ్ మూవీస్ టోటల్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ లను మరిపించేలా ఉండటం విశేషం, హిందీ డబ్బింగ్ మూవీస్ కి ఇలాంటి బిజినెస్ లు జరగడం అరుదు అనే చెప్పాలి. కోస్టల్ ఆంధ్ర ఏరియాలో ఈ సినిమా కి…
6 కోట్ల దాకా రేటు పలికిందట. మేకర్స్ కొంచం ఎక్కువ రేటుని ఆశించినా ఓవరాల్ గా ఈ ఏరియాలో ఈ రేటు ఫైనల్ అయిందని ట్రేడ్ లో సమాచారం. మిగిలిన ఏరియాలలో కూడా సినిమా బిజినెస్ మంచి జోరు మీద ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ మరింతగా పెరిగి పోయింది అని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా అటు హిందీ లో ఇటు తెలుగు లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది, ఇక సీడెడ్ మరియు మెయిన్ నైజాం ఏరియాల బిజినెస్ లెక్కలు కూడా సాలిడ్ గానే జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.