మంచి ప్రమోషన్స్ ని జరుపుకున్న అన్నీ మంచి శకునములే సినిమా ఆడియన్స్ ముందుకు ఉన్నంతలో భారీగానే రిలీజ్ అయింది ఇప్పుడు. డీసెంట్ ప్రోమోలతో సినిమా డీసెంట్ ఎంటర్ టైనర్ గా నిలిచే అవకాశం ఉంది అనిపించగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్నీ మంచి శకునములే ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…. ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….
కాఫీ ఎస్టేట్ ల విషయంలో ఫ్యామిలీ గొడవల కారణంగా నరేష్ మరియు రాజేంద్రప్రసాద్ ల ఫ్యామిలీలు విడిపోతాయి. వాళ్ళ పిల్లలు అయిన హీరో హీరోయిన్స్ ఎలా వాళ్ళ పేరెంట్స్ ని కలపడానికి ట్రై చేశారు. తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా అసలు కథ.. అలాగే హీరో హీరోయిన్స్ గురించిన ఓ ట్విస్ట్ కూడా ఉంటుంది… అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
పెర్ఫార్మెన్స్ పరంగా హీరో సంతోష్ శోభన్ మరోసారి పర్వాలేదు అనిపించేలా నటించి మెప్పించగా మాళవిక రోల్ కూడా మెప్పిస్తుంది. మిగిలిన భారీ సపోర్టింగ్ స్టార్ కాస్ట్ అంతా కూడా ఆకట్టుకోగా సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించింది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం స్లో నరేషన్ తో బోర్ కొట్టిస్తుంది…
కొంచం ఓపిక చేసుకుని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఫస్టాఫ్ కథ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టగా సెకెండ్ ఆఫ్ లో కథ బాగానే సాగినా కానీ స్లో నరేషన్ వలన సినిమా బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది… సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా మెప్పించాయి.
ఇక డైరెక్షన్ విషయానికి వస్తే నందిని రెడ్డి సింపుల్ కథ నే ఎంచుకోగా దానికి అల వైకుంఠ పురంలో పాయింట్ ని మరోలా ప్రజెంట్ చేసి 2 ఫ్యామిలీల మధ్య వచ్చే మనస్పర్ధలు నేపధ్యంలో డీసెంట్ ఎంటర్ టైనర్ నే తెరకెక్కించినా చెప్పిన విధానం చాలా నెమ్మదిగా ఉండటంతో అక్కడక్కడా బోర్ ఫీల్ అవ్వడం ఖాయమని చెప్పాలి.
కొన్ని సీన్స్ కామెడీ పరంగా మెప్పించినా, కొన్ని సీన్స్ ఎమోషనల్ పరంగా ఆకట్టుకున్నా కూడా ఓవరాల్ గా స్టొరీ పాయింట్ చాలా నార్మల్ గా ఉండటం లెంత్ ఎక్కువ అవ్వడంతో బోర్ ఫీల్ అయ్యేలా చేయడంతో ఓపిక చేసుకుని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంచం లెంత్ ని తగ్గించి ఉంటే ఇంకొంచం బెటర్ గా ఉండేది…
మొత్తం మీద సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్వాలేదు అనిపించవచ్చు, రెగ్యులర్ ఆడియన్స్ కొంచం ఓపిక చేసుకుని చూస్తె నార్మల్ స్టొరీ పాయింట్ తో వచ్చిన అన్నీ మంచి శకునములే చాలా చాలా నార్మల్ గా అనిపిస్తుంది… అసలు ఎలాంటి ఎక్స్ పెర్టేషన్స్ ని పెట్టుకోకుండా కొంచం ఓపిక చేసుకుని చూస్తె సినిమా పర్వాలేదు అనిపించవచ్చు. మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్….