గత ఏడాది ఫిదా సినిమా తో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ కొట్టిన వరుణ్ తేజ్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో తొలిప్రేమ సినిమా తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి సమయంలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు అంతరిక్షం సినిమా తో రాబోతుండగా ఈ సినిమా పూర్తిగా స్పేస్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక సినిమా అయినా కానీ బిజినెస్ పరంగా దుమ్ము లేపింది అనే చెప్పాలి. సినిమా టోటల్ గా…
సాధించిన బిజినెస్ ని పరిశీలిస్తే…నైజాం లో 5 కోట్లు, సీడెడ్ లో 2 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 7.5 కోట్ల బిజినెస్ ని అందుకోగా రెండు రాష్ట్రాలలో టోటల్ గా 14.5 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1 కోటి బిజినెస్ సాధించగా…
ఓవర్సీస్ లో 3.5 కోట్ల బిజినెస్ ని అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ ఇప్పుడు 19 కోట్లు అందుకోగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 20 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది, 5 భారీ సినిమాల పోటి లో ఈ ప్రయోగాత్మక సినిమా హిట్ అవ్వాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పాలి. మరి ఎం జరుగుతుందో చూడాలి.