బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన ఇండస్ట్రీల పరిస్థితి ఎలా ఉన్నా కూడా తమిళ్ ఇండస్ట్రీ కి మాత్రం ఈ ఇయర్ ఇప్పటి వరకు అయితే పెద్దగా టైం కలిసి రాలేదు, సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన కాప్టెన్ మిల్లర్ అలాగే అయలాన్ సినిమాల తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది అనే చెప్పాలి.
కానీ తర్వాత పెద్దగా సినిమాలు ఏవి రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అయిన సినిమాలు ఏమాత్రం మెప్పించ లేక పోయాయి. టాప్ స్టార్స్ నటించే సినిమాలు ఏవి ఫస్టాఫ్ లో లేక పోవడంతో కనీస హిట్స్ కూడా లేని పరిస్థితి కోలివుడ్ కి ఏర్పడగా ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన….
హర్రర్ కామెడీ మూవీ అయిన అరణ్మనై4(Aranmanai4 Movie) సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా పెద్దగా కలెక్షన్స్ వస్తాయో రావో అనుకున్నా కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా…
మిక్సుడ్ టాక్ తోనే ఇప్పుడు ఏకంగా ఈ ఇయర్ ఇప్పటి వరకు కోలివుడ్ నుండి వచ్చిన మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సంక్రాంతికి రిలీజ్ అయిన శివ కార్తికేయన్(Siva Kartikeyan) నటించిన అయలాన్(Ayalaan Movie) మూవీ టోటల్ రన్ లో 80.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
సొంతం చేసుకుని ఇప్పటి వరకు కోలివుడ్ టాప్ గ్రాసర్ గా ఈ ఇయర్ లో నిలవగా ఇప్పుడు ఆ సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి 80.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న అరణ్మనై4 సినిమా టోటల్ రన్ లో 85 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, దాంతో ఈ ఇయర్ ఫస్టాఫ్ కి కోలివుడ్ బిగ్ గ్రాసర్ గా ఈ సినిమానే నిలిచే అవకాశం ఉంది.