బాహుబలి తో పాన్ ఇండియా లెవల్ లో మంచి పేరు ని క్రేజ్ ను సొంతం చేసుకున్న రానా దగ్గుబాటి ఆ క్రేజ్ ను మరీ క్యాష్ చేసుకోవాలని కాకుండా తన చాయిస్ ప్రకారం సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత భారీ గ్యాప్ తర్వాత రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు అరణ్య సినిమా తో వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను…
అందుకోవడంలో విఫలం అవ్వగా సినిమాకి ఎలాంటి బిజినెస్ జరగక పోవడం తో ఓన్ గానే రిలీజ్ అయిన ఈ సినిమా బడ్జెట్ దృశ్యా భారీ నష్టలనే మిగిలించింది అని చెప్పాలి. ఇలాంటి టైం సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సిన రానా మరో సినిమా…
విరాట పర్వం పై బజ్ బాగానే ఉండటం తో అరణ్య ఫ్లాఫ్ ఎఫెక్ట్ ఏమి పడకుండా తెలుగు రాష్ట్రాలలో 18 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ ను అలాగే వరల్డ్ వైడ్ గా 20 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో డిసాస్టర్ పడ్డా ఈ రేంజ్ బిజినెస్ చూసి రానా మార్కెట్ స్టేబుల్ గానే ఉందని అంతా…
అనుకోగా ఇంతలో సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ కి చేరడం తో మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా సినిమా కి డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ కోసం మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట. డిసాస్టర్ తర్వాత థియేట్రికల్ బిజినెస్ ఎక్కువగా జరిగింది అనుకుంటే డైరెక్ట్ రిలీజ్ కోసం ఏకంగా ఈ సినిమా కి…
30 కోట్ల రేటు ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా రూపొందటం తో ఈ రేంజ్ లో రేటు సొంతం అయ్యిందని అంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం ప్రస్తుతానికి థియేటర్స్ లోనే రిలీజ్ అని అంటున్నారట. బహుశా రేటు ఇంకాస్త ఎక్కువ వస్తే సినిమా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అయ్యే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి…