రానా దగ్గుబాటి బాహుబలి సినిమాతో వచ్చిన పేరు ను ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి పోగొట్టుకోకుండా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉన్న సినిమాలను చేయాలనీ అనుకున్నా కానీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా అరణ్య పూర్తిగా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుని దెబ్బ కొట్టింది. ఈ సినిమా ను పాన్ ఇండియా లెవల్ లో అనౌన్స్ చేసినా కానీ రిలీజ్ ను సౌత్ భాషలకు…
పరిమితం చేయాల్సి వచ్చింది…. సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం తో మేకర్స్ అన్ని చోట్లా సినిమాను ఓన్ రిలీజ్ చేశారు. దాంతో సినిమా బడ్జెట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర రికవరీ చేయాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 60 కోట్ల మమ్మోత్ బడ్జెట్ కి…
కేవలం 5 కోట్లు కూడా రికవరీ చేయలేక పోయింది. దాంతో ఇక ఆశాలన్నీ హిందీ వర్షన్ మీదే పెట్టుకున్న మేకర్స్ హిందీ లో ఎంతో కొంత రికవరీ అయితే చాలని ఇన్ని రోజులు రిలీజ్ చేయకుండా ఎదురు చూశారు కానీ అక్కడ పరిస్థితులు ఏమాత్రం సెట్ కాకపోవడం తో ఇక ఇప్పుడు చేసేదేమీ లేక…
సినిమా మీద ఒక నిర్ణయం తీసుకోవాలని సినిమాను ఇప్పుడు హిందీ లో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా తమ అసోసియేట్ OTT అయిన జీ నెట్ వర్క్ లో… ఈ నెల 18 న సినిమా డైరెక్ట్ రిలీజ్ హిందీ లో కాబోతుందని అలాగీ ఎరోస్ నవ్ లో కూడా సినిమా అందుబాటులో ఉంటుందని చెప్పారు…
ఇక సౌత్ భాషల వర్షన్ అదే రోజు రిలీజ్ చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు… ఈ సినిమా కోసం మొత్తం మీద 60 కోట్లు ఖర్చు చేసిన ఎరోస్ వాళ్ళు అన్ని కలుపుకుని చూసుకున్నా 20 కోట్లు కూడా ఓవరాల్ గా రికవరీ చేసి ఉండరని, మొత్తం మీద ఈ సినిమా వాళ్లకి ఊహకందని నష్టాలను మిగిలించిందని అంటున్నారు… రిలీజ్ కి ముందు డైరెక్ట్ రిలీజ్ కి 50 కోట్ల రేంజ్ ఆఫర్ వస్తే నో చెప్పి ఇప్పుడు ఈ రేంజ్ నష్టాలతో మునిగిపోయారు మేకర్స్..