టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారం లో లిమిటెడ్ థియేటర్స్ లో మినిమమ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ మొత్తం మీద 23 రోజులలో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో 73.19 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 98.04 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 వ రోజు స్టడీ గా ఉన్నప్పటికీ వీకెండ్….
గ్రోత్ ని పెద్దగా సాధించలేక పోయింది…. కానీ ఉన్నంతలోనే పర్వాలేదు అనిపించే విధంగా 7 నుండి 8 లక్షల రేంజ్ లో సినిమా కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సినిమా మిగిలిన చోట్ల కలెక్షన్స్ దాదాపు చివరి స్టేజ్ కి వచ్చేయగా…
కర్నాటక లో మాత్రం ఓ 10-12 థియేటర్స్ లో సినిమా ప్రదర్శితం అవుతుంది, దాంతో సినిమా కలెక్షన్స్ ఈ మూడు రాష్ట్రాల నుండే దీపావళి వరకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కర్నాటకలో బాక్స్ ఆఫీస్ పరుగు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇక రామ్ హెలొ గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల్లో 21 కోట్ల లోపు షేర్ ని అందుకుంది. ఇక 17వ రోజు సినిమా రెండు రాష్ట్రాలలో సుమారు 10 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక పందెం కోడి 2 టోటల్ గా స్లో డౌన్ అయిపోయింది.
దాంతో దసరా సినిమాల్లో కేవలం అరవింద సమేత మరియు హెలొ గురు ప్రేమ కోసమే కొద్దో గొప్పో కలెక్షన్స్ ని సాధిస్తున్నాయి. ఇక నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమా బాక్స్ ఆఫీస్ రెండో రోజు కలెక్షన్స్ ని మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.