Home TRP రేటింగ్ అరవింద సమేత హిందీ TRP….బానే వచ్చిందిగా!

అరవింద సమేత హిందీ TRP….బానే వచ్చిందిగా!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం సాలిడ్ కలెక్షన్స్ ని వసూల్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము లేపగా తర్వాత ఎన్టీఆర్ రెండేళ్ళ కి పైగా టైం ని కేవలం ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించారు. ఇప్పటికీ ఆ సినిమాకే..

పనిచేస్తున్న ఎన్టీఆర్ వచ్చే ఏడాది ఆ సినిమా తో ఆడియన్స్ ముందుకు రానుండగా ఎన్టీఆర్ అరవింద సమేత టెలివిజన్ లో తెలుగు లో టెలికాస్ట్ లో రిపీట్స్ వేస్తూ ఉండగా రీసెంట్ గా కన్నడలో డబ్ అయ్యి టెలికాస్ట్ అవ్వగా అక్కడ అంచనాలను అందుకోలేక పోయింది.

షాకింగ్ లో రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా 3 TRP తోనే సరిపెట్టుకోగా అరవింద సమేత హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ఏకంగా 18 కోట్ల రేటు సొంతం చేసుకోగా, సినిమా టెలికాస్ట్ ఎప్పటి నుండో పెండింగ్ లోనే ఉంటూ వచ్చింది, చాలా నెలలుగా కమ్మింగ్ సూన్ అంటూ ఊరిస్తున్నా ఎట్టకేలకు….

రీసెంట్ గా సినిమాను అక్కడ జీ సినిమా ఛానెల్ లో టెలికాస్ట్ చేశారు…. కాగా సినిమాకి అక్కడ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. సినిమాకి మొత్తం మీద 40 లక్షల 31 వేల ఇంప్రెషన్స్ దక్కగా మన TRP లెక్కల్లో చూసుకుంటే మొత్తం మీద సినిమా కి 5.3 TRP రేటింగ్ దక్కింది అని అంచనా వేయవచ్చు.

ఇది పర్వాలేదు అనిపించే రేటింగ్ కాగా అక్కడ తెలుగు సినిమాల పరంగా ప్రభాస్ మూవీస్ టాప్ లో ఉండగా తర్వాత అల్లు అర్జున్ DJ మరియు నా పేరు సూర్య 1 కోటికి పైగా ఇంప్రెషన్స్ తో దుమ్ము లేపాయి, ఎన్టీఆర్ మూవీస్ ఇప్పుడిప్పుడే హిందీ లో మరింత ఇంప్రూవ్ అవుతూ ఉండగా RRR సినిమా తో భారీగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here