టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ లెవల్ లో పుంజుకుంది. సినిమా పండగ హాలిడేస్ తర్వాత పూర్తిగా స్లో డౌన్ అవ్వగా తిరిగి మూడో వీకెండ్ లో పుంజుకోగా ఆదివారం రోజున ది బెస్ట్ అనిపించే కలెక్షన్స్ ని సాధించి అన్నీ ఏరియాలలో సాలిడ్ కలెక్షన్స్ తో వీకెండ్ ని ఘనంగా ముగించింది.
కాగా మూడో ఆదివారం రోజున సినిమా మినిమమ్ 70 లక్షల రేంజ్ తో మొదలు అవ్వగా ఈవినింగ్ నైట్ షోల గ్రోత్ తో 85 లక్షల రేంజ్ దాకా ఎదగగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు తో రోజుని ఏకంగా 90 లక్షల రేంజ్ లో ముగించి దుమ్ము లేపింది ఈ సినిమా.
సినిమా నైజాంలో 34 లక్షలు, సీడెడ్ లో 27 లక్షలు, టోటల్ ఆంధ్రాలో 20 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసిందని అంచనా. మొత్తం మీద 91 లక్షల షేర్ ని సినిమా రెండు రాష్ట్రాలలో అందుకుందట. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1.05 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.