Home గాసిప్స్ ఫస్ట్ మూవీ రిలీజ్ కాలేదు…2వ సినిమా కంప్లీట్…బడ్జెట్ అండ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యిందంటే!!

ఫస్ట్ మూవీ రిలీజ్ కాలేదు…2వ సినిమా కంప్లీట్…బడ్జెట్ అండ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యిందంటే!!

1448
0

టాలీవుడ్ లో కొందరి సినిమాలు అనుకోకుండా ఫస్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అవ్వకుండానే రెండో సినిమా ఆఫర్లు రావడం వాటిని పూర్తీ చేయడం కూడా జరుగుతుంది, ఇది వరకు ఇలానే సాయి ధరం తేజ్ ముందు రేయ్ సినిమా మొదలు పెట్టినా అది రిలీజ్ అవ్వక ముందే పిల్లా నువ్వు లేని జీవితం మొదలు పెట్టి పూర్తీ చేసి రిలీజ్ చేశాడు, ఇప్పుడు ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా…

ఉప్పెన మంచి క్రేజ్ నడుమ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉన్నా కానీ కరోనా వలన కుదరలేదు, దాంతో అప్పటి నుండి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ను ఇక రిలీజ్ అయినప్పుడే అని వదిలేసి రెండో సినిమా మొదలు పెట్టాడు వైష్ణవ్ తేజ్…

పవన్ కళ్యాణ్ తో పాన్ ఇండియా మూవీ కి కూడా బ్రేక్ పడటంతో డైరెక్టర్ క్రిష్ ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమా చేయాలనీ డిసైడ్ అవ్వగా వెంటనే వైష్ణవ్ తేజ్ తో ఏకంగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కాంబినేషన్ సెట్ చేసి కేవలం 45 రోజుల వర్కింగ్ డేస్ లో ఓ విలేజ్ డ్రామాని…

తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమాకి “కొండపాలెం” అనే టైటిల్ ని కూడా అనుకుంటూ ఉండగా సినిమా కాన్సెప్ట్ గమ్యంలో అన్నల కాన్సెప్ట్ తరహాలో అడవులలో కథ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంటున్నారు. కాగా ఈ సినిమా కి బడ్జెట్ మొత్తం మీద 15 కోట్ల దాకా అయ్యిందని అంటున్నారు. కేవలం 45 రోజుల వర్కింగ్ డేస్ లో…

15 కోట్ల బడ్జెట్ తో కరోనా టైం లో సినిమా మొదలు పెట్టి పూర్తీ కూడా చేశాడు క్రిష్, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా కూడా త్వరలో రిలీజ్ కి సిద్ధం కానుంది. మరి డైరెక్ట్ రిలీజ్ చేస్తారా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా అన్నది కూడా త్వరలో తేలనుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here