సోషల్ మీడియా లో రీసెంట్ టైం లో ఎదో ఒక ట్రెండ్ కంటిన్యు గా జరుగుతున్న విషయం తెలిసిందే. హీరోల పుట్టిన రోజు ట్రెండ్స్ తో పాటు సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ క్రమం తప్పకుండా జరుగుతూనే ఉండగా ప్రతీ ట్రెండ్ లో కూడా కొత్త రికార్డులు నమోదు అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. టాప్ హీరోలతో పాటు, సీనియర్ హీరోల ఫ్యాన్స్ యంగ్ హీరోల ఫ్యాన్స్ కూడా ఈ ట్రెండ్స్ లో పాల్గొంటున్నారు.
రీసెంట్ గా టైర్ 2 హీరోల సినిమా ల యానివర్సరీ ట్రెండ్స్ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఒక్కో హీరో ఫ్యాన్స్ ఒక్కో సారి ఈ ట్రెండ్స్ లో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దుమ్ము లేపోతున్నారు. ముందు 100% లవ్ తో నాగచైతన్య ఫ్యాన్స్ 4 లక్షల రికార్డ్ కొట్టగా…
ఆ రికార్డ్ ను ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ఫ్యాన్స్ బ్రేక్ చేశారు, ఆ రికార్డ్ ను డియర్ కామ్రేడ్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బ్రేక్ చేయగా ఆ రికార్డ్ ను మళ్ళీ రామ్ ఫ్యాన్స్ కందిరీగ ట్రెండ్ తో బ్రేక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ రికార్డ్ ను….
అర్జున్ రెడ్డి ట్రెండ్ తో బ్రేక్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఈ సినిమా టాలీవుడ్ లో ఒక పాత్ బ్రేకింగ్ మూవీ గా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఎవ్వరూ కూడా ఇలాంటి సినిమాను చూడలేదు. 3 గంటల లెంత్ ఉన్నా ఒక ఫ్లోలో అలా గడిచిపోతుంది సినిమా మొత్తం. అలాంటి సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్లకు పైగా షేర్ ని అందుకుని…
దుమ్ము లేపిన విజయ్ దేవరకొండ యూత్ సెన్సేషన్ గా మారాడు. ఈ సినిమా వచ్చి మూడేళ్ళు పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ట్రెండ్ చేయగా 24 గంటల్లో 5 లక్షల 25వేల ట్వీట్స్ తో రికార్డ్ కొట్టారు. ఒకసారి టాప్ లిస్టుని గమనిస్తే…
👉#3YearsForArjunReddyMania- 525.3K***
👉#9YearsForKandireega – 499.8K
👉#1YearForDearComrade – 475.4K
👉#1YearForiSmartShankar – 461.3K
👉#9YearsFor100PercentLove- 401.6K
👉#1YearforClassicJERSEY – 391.6K
👉#3YearsforNinnuKori – 353.5K
Idhe mass ante