Home న్యూస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ రివ్యూ…కళ్యాణ్ రామ్ కి హిట్ పక్కా!

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ రివ్యూ…కళ్యాణ్ రామ్ కి హిట్ పక్కా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పటాస్, బింబిసార లాంటి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నప్పటికీ కూడా మధ్యలో చాలానే ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంగా తన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie)…

ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో డీసెంట్ అంచనాలు అయితే ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…కాగా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం…

ఎంతైనా ఉందీ అనిపించే లెవల్ లో మెప్పించింది అని చెప్పాలి. అలాగే దాదాపు సినిమా స్టోరీ పాయింట్ ను కూడా ట్రైలర్ లోనే చెప్పేశారు….సమాజంలో గొప్ప పేరున్న పోలిస్ ఆఫీసర్ అయిన తల్లి తన కొడుకు కూడా పోలిస్ అవ్వాలని అనుకుంటుంది.. కానీ కొడుకు…

అనుకోని పరిస్థితులలో గుండాగా మారతాడు….దాంతో కొడుకునే అరెస్ట్ చేయడానికి చూస్తున్న తల్లి మీద ఉన్న అపార ప్రేమతో హీరో ఏం చేశాడు అన్నది కాన్సెప్ట్ గా ట్రైలర్ లో ఆల్ మోస్ట్ కథని రివీల్ చేయగా…కళ్యాణ్ రామ్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ పర్వాలేదు అనిపించగా…

విజయశాంతి స్క్రీన్ ప్రజెన్స్…తల్లి కొడుకుల బందం బాగానే చూపించారు అనిపించింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ లో బాగానే ఎలివేట్ అవ్వగా ఓవరాల్ గా సినిమా మీద ఉన్న అంచనాలను ట్రైలర్ చాలా వరకు పెంచేసింది అని చెప్పాలి..

సినిమా కూడా ట్రైలర్ రేంజ్ లోనే ఆడియన్స్ ను అలరించగలిగితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు ఈ అంచనాలను నిజం చేయగలుగుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here