Home న్యూస్ బడే మియా చోటే మియా ట్రైలర్ రివ్యూ….ఏంటి సామి ఇదీ!!

బడే మియా చోటే మియా ట్రైలర్ రివ్యూ….ఏంటి సామి ఇదీ!!

0

చాలా టైంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) మరియు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) లు ఇద్దరూ ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan Trailer) భారీ అంచనాల నడుమ ఇప్పుడు ఈ రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతూ ఉండగా….

బాలీవుడ్ లో రీసెంట్ టైంలో ఈ సినిమా మీద భారీ హైప్ ను పెంచారు….ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ మూవీ లో కూడా లేని రేంజ్ గ్రాండియర్ తో భారీ లెవల్ లో ఈ సినిమా ఉండబోతుందని ఊదరగొట్టారు… దాంతో సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా…

సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత ఏంటి సామి ఇదీ అనిపించేలా అనిపించింది సినిమా ట్రైలర్…ఆల్ రెడీ ఇలాంటి కథతోనే బాలీవుడ్ లో SPY యూనివర్స్ లో సినిమాలు వస్తూనే ఉండటం, మళ్ళీ అదే పాయింట్ తో బడే మియా చోటే మియా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది…

ఒక విలన్…ఇండియాకి సంబందించి ఒక కీలక వస్తువును దొంగిలిస్తాడు…. ఆ విలన్ ని పట్టుకోవడానికి ఇద్దరు సంకీ హీరోలు వస్తారు…విలన్ ను వాళ్ళు ఎలా పట్టుకున్నారు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది కథ…ఇదే పాయింట్ తో ఆల్ మోస్ట్ టైగర్ జిందా హై, పఠాన్, వార్ మూవీ ఇలా రీసెంట్ టైంలో అన్నీ సేం కంటెంట్ తోనే…

సినిమాలు రాగా ఇప్పుడు బడే మియా చోటే మియా ట్రైలర్ చూస్తుంటే ఆల్ మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది అనిపించింది…. విజువల్స్ అండ్ గ్రాండియర్ కూడా వార్ మూవీని చాలా వరకు గుర్తు చేసింది… మరి ఏముందని ఈ రేంజ్ లో ఈ సినిమాను లేపారు అన్నది ఇక సినిమా వచ్చాకే తెలుస్తుంది… ఓవరాల్ గా మరీ ఎక్స్ పెర్ట్ చేసినంత అయితే లేదనే చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here