Home న్యూస్ మోస్ట్ హైప్ గేమ్ చేంజర్ 1st సాంగ్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!

మోస్ట్ హైప్ గేమ్ చేంజర్ 1st సాంగ్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!

0

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సౌత్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్(Shankar) ల క్రేజీ కాంబినేషన్ లో ఎప్పటి నుండో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) ఈ ఇయర్ ఎండ్ టైంకి ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉండగా సినిమా నుండి ఎప్పుడో ఫస్ట్ సాంగ్ అయిన…

జరగండి జరగండి(Jaragandi Jaragandi Song From Game Changer Movie) సాంగ్ ను రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ అనుకోకుండా సాంగ్ లీక్ అవ్వగా తర్వాత సాంగ్ రిలీజ్ ను నిరవధికంగా పోస్ట్ పోన్ చేయగా చాలా టైం సాంగ్ పై ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వలేదు టీం…

కానీ ఎట్టకేలకు ఇప్పుడు రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు…దాంతో ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత 24 గంటల్లో యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దులపాలని ప్లాన్ చేస్తున్నారు… ప్రస్తుతానికి టాలీవుడ్ లో రిలీజ్ అయిన…

లిరికల్ వీడియోల పరంగా హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని అందుకున్న సాంగ్స్ ను గమనిస్తే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను అందుకున్న సాంగ్ రికార్డ్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) లోని దం మసాలా సాంగ్ పేరిట ఉంది. ఆ సాంగ్ 24 గంటలలో 17.42 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ రికార్డ్ కూడా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట(Sarkaru vaari paata) సినిమాలోని కళావతి(Kalavathi Song) 806.3K లైక్స్ మార్క్ తో టాప్ లో ఉంది. ఇక గేమ్ చేంజర్ సినిమా నుండి వస్తున్న జరగండి జరగండి సాంగ్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here