బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో ఊరమాస్ కలెక్షన్స్ తో దంచికొట్టిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా బలగం. చిన్న సినిమా గా రిలీజ్ అయిన ఈ సినిమా ఊహకందని కలెక్షన్స్ తో లాభాలను సొంతం చేసుకుంది. ఒక్క నైజాం ఏరియాలోనే 70% కి పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన బలగం టోటల్ రన్ లో 12.55 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకున్న బలగం 1.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 11.25 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక తర్వాత డిజిటల్ లో కూడా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపిన ఈ సినిమా తర్వాత శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా…
ఛానెల్ సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా టెలికాస్ట్ అవ్వగా ఊహకందని రేటింగ్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. కొన్ని పెద్ద సినిమాలు కూడా సాధించని రేంజ్ లో దుమ్ము లేపిన ఈ సినిమా ఏకంగా 14.30 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది.
ఓ చిన్న సినిమా ఈ రేంజ్ లో రేటింగ్ ను సొంతం చేసుకోవడం, అది కూడా ప్రస్తుతం సూపర్ సక్సెస్ అయిన IPL మ్యాచుల ఎఫెక్ట్ ను కూడా తట్టుకుని ఈ రేంజ్ లో రేటింగ్ ను బలగం సొంతం చేసుకోవడం అనేది మాములు విషయం కాదనే చెప్పాలి ఇప్పుడు…