నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేయగా వీరి కాంబినేషన్ లో మొదలైన హాట్రిక్ మూవీ పై అంచనాలు మొదట్లో నుండే ఉన్నా కానీ టీసర్ రిలీజ్ తర్వాత అవి మరింత పీక్స్ కి వెళ్ళాయి అని చెప్పాలి.
అప్పటి నుండి సినిమా రేంజ్ మరో విధంగా మారిపోయింది, అంతకుముందు ఇటు బాలయ్య కానీ అటు బోయపాటి కానీ వరుస ఫ్లాఫుల్లో ఉండటం తో ఈ సినిమాను బాలయ్య ఎక్కువ శ్రద్ధ తీసుకుని 25 కోట్లలోపే బడ్జెట్ తో పూర్తీ చేయాలనీ బోయపాటి కి సూచించారు.
కానీ టీసర్ కి రెస్పాన్స్ భారీగా పెరగడం అలాగే బోయపాటి మూవీస్ కి టెలివిజన్ లో హిట్ ఫ్లాఫ్ తేడా లేకుండా అల్టిమేట్ TRP రేటింగ్ లు రావడం తో నిర్మాత ముందుకు వచ్చి ఫుల్ ఫ్రీడం అండ్ క్వాలిటీ విషయం లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకూడదని సూచించారని సమాచారం.
దాంతో సినిమా బడ్జెట్ అండ్ క్వాలిటీ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది అని అంటున్నారు. 25 కోట్లలో నిర్మాణం అనుకున్న సినిమా కాస్త ఇప్పుడు 55 కోట్లకు పైగా బడ్జెట్ లో రూపొందబోతున్న సినిమాగా మారింది అని లేటెస్ట్ గా సమాచారం ఆడుతుంది. బాలయ్య ఇందులో అఘోరా గా కనిపించబోతూ ఉండటం దానికోసం భారీ సెట్టింగ్ లు అవసరం ఉండటం అలాగే స్టార్ కాస్ట్ కూడా భారీగా ఉండగా…
కేవలం బాలయ్య బోయపాటి కి రెమ్యునరేషన్ పరంగానే ఇప్పుడు 22 కోట్ల నుండి 25 కోట్లు వెళ్ళబోతుంది అని అంటున్నారు. మిగిలిన బడ్జెట్ లో సినిమా మంచి క్వాలిటీ తో తెరకెక్కించబోతున్నారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంతవరకు ఈ బడ్జెట్ ని రికవరీ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరికీ కంబ్యాక్ గా నిలుస్తుందో చూడాలి మరి.