నట సింహం నందమూరి బాలకృష్ణ కి 2019 ఇయర్ అస్సలు కలిసి రాలేదు, 2018 ఇయర్ సంక్రాంతి కి జై సింహా సినిమా తో మెప్పించిన బాలయ్య 2019 ఇయర్ లో చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు మరియు రూలర్ సినిమా లు ఒకటి తర్వాత ఒకటి భారీ ఫ్లాఫ్స్ గా మిగలగా ఆ ఇంపాక్ట్ బాలయ్య అప్ కమింగ్ మూవీ పై గట్టిగా పడుతుందని అంతా అనుకున్నారు. తన అప్ కమింగ్ మూవీ…
డైరెక్టర్ బోయపాటి కూడా రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కొట్టని కారణంగా వీళ్ళ కాంబో లో ఇది వరకు సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చినా ఇద్దరూ ఫ్లాఫ్స్ లో ఉండటం తో ఎలాంటి బిజినెస్ వీళ్ళ హాట్రిక్ మూవీ కి జరుగుతుంది అన్నది…
అందరి లోనూ డౌట్ ని కంటిన్యు చేస్తున్న టైం లో బాలయ్య బోయపాటి ల మూడో సినిమా డిజిటల్ బిజినెస్ దుమ్ము లేపే రేంజ్ లో జరిగిందని లేటెస్ట్ ట్రేడ్ టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని టాప్ OTT కంపెనీ 9.15 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.
పేరు రివీల్ చేయలేదు కానీ ప్రైమ్ వీడియో నే ఎక్కువగా సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమె జరిగిన సినిమా కి డిజిటల్ రైట్స్ కిందనే 9.15 కోట్లు పలకడం అది కూడా ఇద్దరూ ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా ఈ రేటు అంటే గొప్పే అని చెప్పాలి. ఇక శాటిలైట్ రైట్స్ బిజినెస్…
దాంతో పాటు హిందీ డబ్బింగ్ బిజినెస్ లు కూడా ఇప్పుడు సాలిడ్ గా జరిగే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా రిలీజ్ నాటికి పరిస్థితులు అన్నీ సద్దుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం మీద బాలయ్య కెరీర్ బెస్ట్ గా నిలిచే అవకాశం కూడా ఉందని ఈ బిజినెస్ హింట్ ఇస్తుందని చెప్పొచ్చు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా ఇప్పుడు వచ్చే ఇయర్ సమ్మర్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేస్తారని అంటున్నారు….