Home న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తున్న బాలయ్య చెన్నకేశవ రెడ్డి….రికార్డ్ పక్కా!!

ప్రకంపనలు సృష్టిస్తున్న బాలయ్య చెన్నకేశవ రెడ్డి….రికార్డ్ పక్కా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య అఖండ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన ఊపులో ఉండగా బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న కొత్త ట్రెండ్ అయిన స్పెషల్ షోల ట్రెండ్ ని కొనసాగిస్తూ ఉన్నారు, పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ జల్సా తో పీక్స్ కి వెళ్ళింది. ఇప్పుడు సీనియర్ హీరో అయిన బాలయ్య నటించిన ఓల్డ్ మూవీ…

చెన్న కేశవ రెడ్డి సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 20 ఏళ్ళు ఈ నెల 24 తో కంప్లీట్ అవుతున్న నేపధ్యంలో వరల్డ్ వైడ్ గా స్పెషల్ షోలు వేయాలని ఫ్యాన్స్ డిసైడ్ అవ్వగా తెలుగు రాష్ట్రాల మాస్ ఆడియన్స్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటె…

ఓవర్సీస్ ఆడియన్స్ క్లాస్ అనుకుంటే ఈ మాస్ మూవీని చూడటానికి ఎగబడుతున్నారు. కాగా అమెరికాలో ఈ సినిమా పై క్రేజ్ ఎక్స్ లెంట్ గా ఉండగా అక్కడ స్పెషల్ షోల గ్రాస్ కలెక్షన్స్ కొత్త రికార్డుల వైపు దూసుకు పోతూ ఉండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అని చెప్పాలి.

అమెరికాలో స్పెషల్ షోల తో పోకిరి సినిమా ఆల్ మోస్ట్ 16 వేల డాలర్స్ ని అందుకుంటే జల్సా సినిమా 37.5 వేల డాలర్స్ ని సొంతం చేసుకుంది. ఇక స్పెషల్ షోలకు 2 రోజుల ముందు వరకు ఉన్న స్టేటస్ తో చెన్న కేశవ రెడ్డి సినిమా కి అక్కడ అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా ఆల్ మోస్ట్ 26 వేల డాలర్స్ వరకు సొంతం అయ్యాయని సమాచారం.

స్పెషల్ షోలకు ఇంకా 2 రోజుల టైం ఉన్న నేపధ్యంలో కచ్చితంగా జల్సా స్పెషల్ షోల రికార్డ్ కలెక్షన్స్ ని అమెరికాలో ఈ మాస్ కంటెంట్ ఉన్న సినిమా బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా కి ఎలాంటి కలెక్షన్స్ ఈ స్పెషల్ షోలతో సొంతం అవుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here