Home న్యూస్ ఛీ…ఛీ నేనెందుకు మాట్లాడుతాను…నాగబాబు కామెంట్స్ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్!

ఛీ…ఛీ నేనెందుకు మాట్లాడుతాను…నాగబాబు కామెంట్స్ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్!

0

రీసెంట్ గా లాక్ డౌన్ సమయం లో తిరిగి షూటింగ్స్ జరుపు కోవడానికి పర్మీషన్ కోసం ఇండస్ట్రీ నుండి పలువురు తెలంగాణా ముఖ్యమంత్రి ని అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ని కలవడం జరిగిన విషయం తెలిసిందే, తర్వాత జూన్ రెండో వారం నుండి రెగ్యులర్ షూటింగ్స్ ని జరుపు కోవచ్చని చెప్పారు. కాగా ఈ మీటింగ్స్ పై నంద మూరి నట సింహం బాలయ్య కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

కాగా తనని ఏ మీటింగ్ కి కూడా పిలవలేదని, వీళ్ళందరూ అక్కడ భూములు పంచుకోవడం కోసం మీటింగ్స్ పెట్టుకుంటున్నారు అని షాకింగ్ కామెంట్స్ చేయగా ఇండస్ట్రీ నుండి కొందరు స్పందించగా నాగ బాబు కూడా కొంచం హార్ష్ గా స్పందించారు.

ఇలాంటి మాటలు మాట్లాడినందుకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని, తను హీరో మాత్రమే నని కింగ్ కాదని కూడా కామెంట్స్ చేశారు. తర్వాత బాలయ్య నుండి ఎలాంటి స్పందన వస్తుందని ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో లో బాలయ్య ఈ విషయాలపై స్పందించాడు, అలాగే నాగబాబు కామెంట్స్ పై మాత్రం ఎందుకనో షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాలయ్య నాగ బాబు కామెంట్స్ గురించి అడిగిన తర్వాత “నేనేం మాట్లాడలా, అతనే మాట్లాడుకుంటున్నాడు.. నేను మాట్లాడను. ఛీఛీ నేను మాట్లాడడమేంటి.. అలాంటి విషయాల గురించి అసలు మాట్లాడను కూడాను. ఒక్కటే చెప్పగలను, ఇవాళ దాదాపు ఇండస్ట్రీ అంతా నాకు సపోర్ట్ చేస్తుంటే నేనేందుకు మాట్లాడతాను’ అంటూ కామెంట్స్ చేశాడు బాలయ్య. దాంతో ఇలాంటి కామెంట్స్ చూసి సోషల్ మీడియా లో గట్టి చర్చలే జరుగుతున్నాయి.

ఇక ఆ ఇంటర్వ్యూలో బాలయ్య ఎన్టీఆర్ రాజకీయాలకు ఇప్పుడే రాడని, తనకి సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉందని, తాను రావాలి అనుకున్నప్పుడు వస్తాడని కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ బాలయ్య బాండింగ్ కన్నా కూడా నాగబాబు పై చేసిన కౌంటర్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది, ఇక నాగబాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here