Home న్యూస్ ఈ ట్రెండింగ్ ఏంటి సామి…బాలయ్య అరాచకం!!

ఈ ట్రెండింగ్ ఏంటి సామి…బాలయ్య అరాచకం!!

0

     సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడం అంత ఆశా మాషీ కాదు, టాప్ స్టార్స్ కి క్రేజ్ ఉన్న మూవీస్ కి మాత్రమె ఇలాంటి ట్రెండ్స్ సాధ్యం అవుతాయి, టాలీవుడ్ లో యంగ్ హీరోల సినిమాలు కూడా అప్పుడప్పుడు ట్రెండ్ అవుతాయి కానీ సీనియర్ హీరోల సినిమాలు ట్రెండ్ అవ్వడం అరుదు, మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ తర్వాత కూడా ట్రెండ్ అవుతూ తన స్టామినా ఏంటో నిరూపించు కుంటూ దూసుకు పోతున్నాడు.

మిగిలిన టాప్ హీరోల్లో నాగార్జున అండ్ వెంకీ లు అప్పుడప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటారు కానీ బాలయ్య ప్రతీ సినిమా అప్ డేట్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడం కామన్, ఇప్పుడు రెండు పరాజయాల తర్వాత కూడా సోషల్ మీడియా లో తన హవా తగ్గలేదని బాలయ్య నిరూపించుకుంటున్నాడు.

కే.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో జై సింహా తర్వాత చేస్తున్న సరికొత్త సినిమా రూలర్ అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మాస్ ని ఆకట్టుకుంటున్న ఈ సినిమా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది, ట్రైలర్ రిలీజ్ అయిన 11 నిమిషంలోనే ఇండియా వైడ్ గా ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన ఈ ట్రైలర్…

వరల్డ్ వైడ్ గా కూడా 18 వ నిమిషం లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది, ఓవరాల్ గా ఇప్పటి వరకు సినిమా అన్ని హాష్ టాగ్స్ పై 40 వేల రేంజ్ లో ట్వీట్స్ పోల్ అయినట్లు సమాచారం. సీనియర్ హీరో అయినా కానీ సోషల్ మీడియా లో ఈ రేంజ్ లో ట్వీట్స్ పడటం విశేషం అనే చెప్పాలి.

అది కూడా ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ అవ్వడం తో బాలయ్య కి ఫ్లాఫ్స్ పడ్డా క్రేజ్ తగ్గలేదని తెలుస్తుంది, ఇక ట్రైలర్ లో కొన్ని లుక్స్ తప్ప ఓవరాల్ గా ట్రైలర్ ఆకట్టుకోగా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ 14 న జరబోతుంది, సినిమా భారీ ఎత్తున ఈ నెల 20 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here