Home గాసిప్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్న బాలయ్య!

షాకింగ్ నిర్ణయం తీసుకున్న బాలయ్య!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తి గా నిరాశ పరిచిన సినిమాలు ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ రెండు పార్టులు అని చెప్పాలి. రెండు సినిమాల కు మినిమం టాక్ వచ్చి పర్వాలేదు చూడొచ్చు అని అందరు అనుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం రెండు సినిమా తీవ్రంగా నిరాశ పరిచి అందరి కీ షాక్ ఇచ్చాయు.

కాగా ఈ రెండు సినిమాల కోసం మొదటి సారిగా నిర్మాత అవతారం ఎత్తిన బాలయ్య మొదటి పార్ట్ బిజినెస్ రేంజ్ చూసి ఇక మీదట తానూ తీయబోయే ప్రతీ సినిమాలో తన నిర్మాణ సంస్థ ని భాగస్వామి గా పెట్టుకుని నిర్మాణం లో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యాడని…

టాక్ గట్టిగానే వినిపించింది, అలా కాకపొతే తన నిర్మాణం లోనే ఎక్కువ సినిమాలు చేయాలనీ భావించాడని టాక్ వచ్చింది… కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ వళ్ళ తీవ్ర నష్టాలను చవిచూడటంతో షాకింగ్ నిర్ణయం తీసు కున్నాడట బాలకృష్ణ. ఇక మీదట తన నిర్మాణం లో సినిమా లు తీయ కూడదని…

పక్క నిర్మాతలతో ఇది వరకు చేసినట్లు సినిమాలు చేయాలనీ భావిస్తున్నాడట బాలయ్య.. తన బ్యానర్ లోనే తనయుడు మోక్షజ్ఞ ని లాంచ్ చేయాలి అనుకున్నా ఇప్పుడు ఆ సినిమా ఇతర బ్యానర్ లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఎన్టీఆర్ సిరీస్ ఫ్లాఫుల…

దెబ్బ తో బాలయ్యకి భారీ షాక్ తగిలినట్లు అయింది, ప్రస్తుతం బాలయ్య చేస్తున్న బోయపాటి సినిమా కూడా NBK ఫిలిమ్స్ ని భావస్వామ్యం చేయాలి అనుకున్నా ఆ నిర్ణయం కూడా వెనక్కి తీసుకున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here