Home న్యూస్ బందోబస్త్ రివ్యూ-రేటింగ్….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

బందోబస్త్ రివ్యూ-రేటింగ్….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ బందోబస్త్ నేడు ప్రేక్షకుల ముందుకు తమిళ్ తెలుగు లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది, సినిమా సుమారు 1430 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్ లో తమిళనాడు లో ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుని మంచి టాక్ నే సొంతం చేసుకుంది, ఇక రెగ్యులర్ షోల నుండి సినిమా కి ఫైనల్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..

   కథ పాయింట్ విషయానికి వస్తే దేశాన్ని, కొందరు వ్యక్తులను టెర్రరిస్టుల నుండి ఏజెంట్ ఎలా కాపాడాడు అన్నది మెయిన్ కథ పాయింట్… కానీ ఇందులో అనేక చిన్న ఉపకథ లు ఉన్నాయి. అవన్నీ రివీల్ చేస్తే బాగుండదు కాబట్టి చెప్పడం లేదు. కథ పాయింట్ బాగానే ఉన్నా సినిమా స్క్రీన్ ప్లే కొంచం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది.

కానీ సూర్య పెర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్స్ డిఫెరెంట్ గెటప్స్ తో సినిమా మొత్తాన్ని తన భుజాన మోశాడు, ఇక మోహన్ లాల్ మరియు ఆర్యలు కూడా కీలక పాత్రలు చేయగా ఇద్దరు కూడా మెప్పిస్తారు. ఇక హీరోయిన్ సయ్యేశా పర్వాలేదు అనిపించే నటనతో ఆకట్టుకుంది.

మిగిలిన నటీనటులు తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేకున్నా ఉన్నంతలో ఆకట్టుకుంటారు. సంగీతం విషయం లో హరీష్ జయరాయ్ యావరేజ్ పాటల తోనే సరిపెట్టగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కుమ్మేశాడు, యాక్షన్ సీన్స్ లో తన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఆకట్టుకుంది.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింత షార్ప్ గా ఉండాల్సింది, కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే కొద్దిగా ఇబ్బంది పెట్టగా లెంత్ కూడా ఎక్కువ అయిన ఫీలింగ్, అక్కడక్కడా స్లో నరేషన్ కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ లోకేషన్స్ చాలా రిచ్ గా ఉన్నాయని చెప్పాలి.

ఇక డైరెక్షన్ పరంగా కెవి ఆనంద్ మరోసారి ఆకట్టుకున్నాడు, స్క్రీన్ ప్లే విషయం లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా కానీ తన మార్క్ డైరెక్షన్ తో మంచి సినిమా తీశాడు. అది రీసెంట్ టైం సూర్య నటించిన సినిమాల్లోకి బెస్ట్ అనిపించే విధంగా ఉందని చెప్పాలి.

మొత్తం మీద ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే
సూర్య – మోహన్ లాల్ – ఆర్య ల పెర్ఫార్మెన్స్
బ్యాగ్రౌండ్ స్కోర్ 
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే
కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే
లెంత్ అండ్ అక్కడక్కడా స్లో గా అవ్వడం
సంగీతం
ఇవీ మొత్తం మీద సినిమా లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్…

మొత్తం మీద సినిమా మరీ అద్బుతం అనలేం కానీ రీసెంట్ టైం లో సూర్య నటించిన సినిమాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమా కి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… ఇది డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అవ్వడం తో రెగ్యులర్ ఆడియన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్నదాని పై సినిమా విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here