భారీ బడ్జెట్ మూవీస్ తో భారీ స్టార్ కాస్ట్ తో సినిమాలు చేసే హీరోలలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు, కెరీర్ మొదలు పెట్టడమే భారీ బడ్జెట్ తో మూవీ తో మొదలు పెట్టి తర్వాత కూడా అలా కంటిన్యు చేయగా బడ్జెట్ అండ్ బిజినెస్ ఎక్కువ అవ్వడం తో కొన్ని సినిమాలు బాగున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేదు, కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి విజయాన్ని…..
రాక్షసుడు సినిమా తో సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, ఆ సినిమా తర్వాత కందిరీగ మరియు రభస డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్ అందరికీ షాక్ ఇస్తూ సడెన్ గా సంక్ర్రాంతి రేసులో ఎంటర్ అయిన విషయం తెలిసిందే.
బాగా ఇప్పటికీ కూడా సినిమాలో టీసర్ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు కానీ సంక్రాంతి రిలీజ్ పనులు ఆల్ రెడీ మొదలు అయ్యాయి. ఇక ఈ సినిమా కి కూడా బడ్జెట్ భారీగానే జరిగింది అని సమాచారం… మొత్తం మీద బడ్జెట్ 35 కోట్ల నుండి ఇప్పుడు 40 కోట్ల రేంజ్ లో…
అయ్యింది అని అంటున్నారు… రాక్షసుడు లో బడ్జెట్ లో తెరకెక్కించడం తో బిజినెస్ కూడా తక్కువే అవ్వడంతో సేఫ్ అయ్యింది, కానీ ఇప్పుడు బడ్జెట్ ఏకంగా 35 నుండి 40 కోట్ల రేంజ్ అవ్వడం సినిమా బిజినెస్ ఎంతవరకు జరిగి ఉంటుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు రికవరీ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి. ఇక సినిమా టీసర్ ట్రైలర్ లను…
త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. సంక్రాంతి బరిలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 న రిలీజ్ కి సిద్ధం అవుతుంది. మరి పోటి ఈ సారి కూడా గట్టిగానే ఉన్న నేపధ్యంలో మొదటి హిట్ కొట్టిన ఊపులో ఉన్న బెల్లంకొండ ఈ సారి పోటి లో ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటాడు అన్నది ఆసక్తిగా మారింది.