కెరీర్ ని 2014 లో అల్లుడు శీను సినిమా తో మొదలు పెట్టిన బెల్లం కొండ శ్రీనివాస్ తొలి సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా మాత్రం హిట్ కొట్ట లేదు, తర్వాత సినిమాలు కూడా బడ్జెట్ ఎక్కువ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ లు కూడా ఎక్కువగా అయ్యి మొత్తం మీద కాస్ట్ ఫేల్యూర్స్ గా మారగా ఎట్టకేలకు రీమేక్ తో హిట్ కొట్టాడు బెల్లం కొండ.
తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాక్షసన్ సినిమాను తెలుగు లో రాక్షసుడు సినిమా గా రీమేక్ చేసి కెరీర్ లో తొలిసారి క్లీన్ హిట్ అందుకున్న బెల్లం కొండ శ్రీనివాస్ ఆ సినిమా తర్వాత చేస్తున్న సినిమా అల్లుడు అదుర్స్, కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో…
తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా సినిమా బాలెన్స్ షూటింగ్ ని రీసెంట్ గా మొదలు పెట్టారు, సినిమా ను సడెన్ గా సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నాం అంటూ కూడా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. ఇదే టైం లో సినిమాకి…
OTT యాప్స్ నుండి ఆఫర్స్ రావడం కూడా మొదలు అయిందని చెప్పాలి. ఈ సినిమా బడ్జెట్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి మాత్రం 15 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి సిద్ధం అయ్యాయట OTT యాప్స్… బెల్లంకొండ ఫస్ట్ హిట్ రాక్షసుడు సినిమా బిజినెస్ రేంజ్ కూడా ఇదే విధంగా ఉండగా…
ఇప్పుడు అల్లుడు అదుర్స్ కి కూడా తొలి ఆఫర్ కింద మంచి రేటు వచ్చింది అనే చెప్పాలి. కానీ యూనిట్ ఎలా రెస్పాన్స్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది, ఈ సినిమా సంక్రాంతి బరిలో కన్ఫాం అయితే మీడియం రేంజ్ హీరోల మధ్య పోటి ఈ సారి సంక్రాంతి కి సాలిడ్ గా ఉండేలా ఉందని చెప్పాలి.