టాలీవుడ్ లో కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరోలలో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ఒకరు…కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి భారీ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉన్నా కూడా ఆశించిన సక్సెస్ దక్కలేదు… జయ జానకి నాయక పర్వాలేదు అనిపించగా…
ఒక్క రాక్షసుడు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయ్యింది. తర్వాత మళ్ళీ రొటీన్ మూవీస్ తో వరుస ఫ్లాఫ్స్ ను ఫేస్ చేస్తున్న బెల్లంకొండ రీసెంట్ గా హిందీ లో చత్రపతి రీమేక్ చేసి మరో డిసాస్టర్ కొట్టగా ఇప్పుడు టైసన్ నాయుడు(Tyson Naidu Movie) తో త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దం అవుతున్నాడు…
ఇక ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా ఇప్పుడు కన్ఫాం అవ్వగా ఈ సారి హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ను భయపెడుతూ నవ్వించి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు…. రెండేళ్ళ క్రితం చావు కబురు చల్లగా సినిమా తీసిన కౌశిక్ డైరెక్షన్ లో ఈ కొత్త సినిమా ఉండబోతుందని సమాచారం….
టాలీవుడ్ లో హర్రర్ కామెడీ జానర్ మూవీస్ రొటీన్ అయిపోయి ఆగిపోయి చాలా టైం అవుతుంది, కానీ తిరిగి ఇప్పుడు మళ్ళీ హర్రర్ కామెడీ టచ్ తో అలరించే ఎంటర్ టైన్ మెంట్ తో వస్తే జనాలు ఆదరిస్తారు అన్న నమ్మకంతో ఈ ప్రయత్నం ఉండబోతుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో బెల్లంకొండ ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి.