థియేట్రికల్ రిలీజ్ లు చేసుకునే అవకాశం లేక పోవడం తో చాలా సినిమాలు గత 6 నెలల నుండి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ వస్తుండగా అందులో తెలుగు లో ఆకట్టుకున్న సినిమాలు కొన్నే ఉన్నాయి. వాటిలో షార్ట్ అండ్ సింపుల్ గా వచ్చిన నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ సినిమా ఒకటని చెప్పాలి. ఈ సినిమా ను తక్కువ బడ్జెట్ లోనే తెరకేక్కించగా మంచి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది…
సినిమా కి OTT ద్వారా కూడా మంచి రేటు దక్కగా తర్వాత శాటిలైట్ రైట్స్ తో మంచి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ముందుగా సినిమా బడ్జెట్ ను గమనిస్తే, సినిమాను 1 కోటి లోపు బడ్జెట్ లోనే పరిమితులతో కూడా క్వాలిటీగా తెరకెక్కించారు.
లెంత్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా తక్కువ నిడివి తో తీయడం కలిసి రాగా సినిమా ను ఆహా వీడియో వాళ్ళు 1.45 కోట్ల రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా. వాళ్లకి మూడు నెలల్లో పెట్టిన పెట్టుబడి కి సాలిడ్ గా వ్యూస్ దక్కి రికవరీ కూడా అయ్యిందని టాక్ ఉంది.
ఇక సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు 1.4 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుని రీసెంట్ గా టెలికాస్ట్ కూడా చేశారు. ఇక సినిమా మ్యూజిక్ రైట్స్ కింద 5 లక్షల దాకా దక్కినట్లు సమాచారం. హిందీ డబ్బింగ్ బిజినెస్ ఈ సినిమా కి జరగలేదు. సో అది పక్కకు పెడితే మొత్తం మీద సినిమాను…
1 కోటి లోపు బడ్జెట్ లో తెరకెక్కించగా టోటల్ గా సినిమా కి జరిగిన బిజినెస్ 2.9 కోట్లు కాగా సినిమా బడ్జెట్ మీద సినిమా కి 1.9 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని నిర్మాత కి మంచి ప్రాఫిట్ ని తేవడమే కాకుండా కొన్న OTT యాప్ కి కూడా ప్రాఫిట్ ని తెచ్చి పెట్టేందుకు సిద్ధం అవుతుండటం విశేషం అనే చెప్పాలి.