Home న్యూస్ భారతీయుడు2…ఒక్క మగాడు అయ్యిందిగా!!

భారతీయుడు2…ఒక్క మగాడు అయ్యిందిగా!!

0

ఒక్క మగాడు….టాలీవుడ్ లో మోస్ట్ హైప్ తో వచ్చిన క్రేజీ మూవీస్ లో ఒకటి….అప్పట్లో ఈ సినిమా మీద హైప్ మరో లెవల్ లో ఉండేది….భారతీయుడు సినిమా స్పూర్తితో తెరకెక్కిన ఒక్క మగాడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తీవ్రమైన ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది…

క్రింజ్ మాక్స్ అనిపించే సీన్స్ తో నిండిపోయిన ఒక్క మగాడు కంప్లీట్ గా ఓవర్ హైప్ వలన అనుకున్న అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిన సినిమా తర్వాత కూడా టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడల్లా ట్రోల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఒక్క మగాడు సినిమాను మరిపించేలా ఎవ్వరూ ఊహించని విధంగా….

భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి అప్పట్లో ఒక్క మగాడు ఎలా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యిందో ఇప్పుడు అలాంటి అంచనాలు లేకున్నా కూడా ఫస్ట్ పార్ట్ ఎపిక్ విజయాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేసిన సీక్వెల్ మూవీ…

అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది. సినిమాలో కమల్ హాసన్ లుక్స్, ఆ ఏజ్ కి చేసే యాక్షన్ కి ఏమాత్రం సంభందం లేక పోవడంతో సినిమా చూసిన వాళ్ళు అందరూ ఇది అసలు శంకర్ సినిమానేనా…శంకర్ డైరెక్షన్ లో ఇలాంటి ట్రోల్ స్టఫ్ ను ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…

సీక్వెల్ ను రెండు పార్టులుగా చేయకుండా ఒకే పార్టుగా చేసి ఉంటే మట్టుకు చాలా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్న భారతీయుడు2 మూవీ మేకర్స్ తీసుకున్న నిర్ణయం వలన ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఇటు సినిమాలో క్రింజ్ సీన్స్ వలన భారీగా ట్రోల్స్ ని సొంతం చేసుకుంటూ కోలివుడ్ ఒక్క మగాడుగా మారిపోయింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here