బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార మీద ట్రేడ్ లో కానీ ఆడియన్స్ లో కానీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గత 2 నెలలుగా టాలీవుడ్ క్లీన్ హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఆ హిట్ ఈ సినిమా నే ఇస్తుందన్న నమ్మకం సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్….
చాలా వరకు నిజం అనిపించేలా చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉండటంతో ఇప్పుడు సినిమాకి జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే ఓపెన్ చేయగా హైదరాబాదులో అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఆల్ మోస్ట్ 80 లక్షలను టచ్ చేయగా రెండు తెలుగు రాష్ట్రాల ఆన్ లైన్ బుకింగ్స్ 1.5 కోట్ల దాకా ఉంటుందని అంచనా… ఇక సినిమా కి టాక్ బాగుండి షో షోకి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…
మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ రీసెంట్ మూవీస్ కన్నా బెటర్ గా ఉండగా ది వారియర్ కన్నా తక్కువగా ఉంది. కానీ రిలీజ్ తర్వాత టాక్ ని బట్టి జోరు చూపించవచ్చు. ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా 3.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి….
ఈ లెక్క పెరిగి 4 కోట్ల నుండి 4.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది, మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి జోరు చూపించి ఓపెనింగ్స్ పరంగా అంచనాలను అందుకుంటుందో లేక మించి పోతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరం అని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఓపెన్ అవుతుందో చూడాలి ఇక…