నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా బడ్జెట్ పరంగా ఎక్కువ బడ్జెట్ తోనే తెరకేక్కినా కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎక్కువ జరగడంతో థియేట్రికల్ బిజినెస్ ను తక్కువకే జరపగా సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుని కళ్యాణ్ రామ్ కి బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ అండ్ సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచింది.
పోటిలో సీతా రామం లాంటి కల్ట్ క్లాసిక్ రాంపేజ్ చూపించినా మాస్ సెంటర్స్ లో బింబిసార హోల్డ్ ఎక్స్ లెంట్ గా ఉండగా తర్వాత కార్తికేయ2 హావా కూడా మొదలైనా తట్టుకుని లాంగ్ రన్ ని బాగానే ఎంజాయ్ చేసి ఊరమాస్ కలెక్షన్స్ ని ఫైనల్ రన్ లో సొంతం చేసుకుంది.
ఒకసారి సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 11.85Cr
👉Ceeded: 8.10Cr
👉UA: 4.91Cr
👉East: 2.01Cr
👉West: 1.47Cr
👉Guntur: 2.26Cr
👉Krishna: 1.60Cr
👉Nellore: 96L
AP-TG Total:- 33.16CR(53.35Cr~ Gross)
Ka+ROI: 2.36Cr
OS – 2.40Cr
Total World Wide: 37.92CR(65.20CR~ Gross)
మొత్తం మీద సినిమా 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో ఏకంగా 21.72 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది, పార్ట్ 2 కచ్చితంగా మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.