Home గాసిప్స్ మెగా కాంపౌండ్ నుండి బోయ ఔట్…చిరు-అల్లుఅర్జున్ మూవీస్ కాన్సిల్!

మెగా కాంపౌండ్ నుండి బోయ ఔట్…చిరు-అల్లుఅర్జున్ మూవీస్ కాన్సిల్!

0

     ఒక్క సినిమా టోటల్ ఫేట్ నే మార్చేయడం అంటే ఇదే నేమో… టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ గా తిరుగు లేని పేరు ఉన్న దర్శకుడు బోయ పాటి శ్రీను. కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమా ల్లో బాక్స్ ఆఫీస్ ఫలితాలను బట్టి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ దర్శకుడి గా విఫలం అవ్వలేదు, మాస్ ఆడియన్స్ ని అలరించడం లో విఫలం అవ్వలేదు బోయ పాటి శ్రీను.

కానీ ఇదంతా వినయ విధేయ రామ సినిమా కి ముందు వరకు.. ఆ సినిమా బోయపాటి కెరీర్ లోనే వీకేస్ట్ స్క్రిప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకుల మనసును ఏమాత్రం గెలుచుకోలేక పోయిన సినిమా… అందులో కొన్ని సీన్స్ కి గాను బోయపాటి సోషల్ ట్రోలింగ్ కి కూడా గురయ్యాడు.

అదంతా ఒకెత్తు అయితే ఎప్పుడైతే రామ్ చరణ్ తమ వల్ల నష్టపోయిన వారికి ఎంతో కొంత సాయం చేయాలి అని ఫిక్స్ అయ్యాడో నిర్మాత కూడా చేతులు కలిపినా బోయపాటి నో చెప్పడం, తర్వాత నిర్మాత తో మాటల యుద్ధం చేసిన విషయం అందరి కీ తెలిసిందే.

తర్వాత మెగా కాంపౌండ్ పెద్దలు చిరు అల్లు అరవింద్ లు కూడా ఈ మ్యాటర్ ని సెటిల్ చేయాలి అని ట్రై చేసినా బోయపాటి వారికి కూడా వినలేదని వార్తలు శిఖారు చేశాయి. దాంతో ఇక సహించని అల్లు అరవింద్ బోయపాటి తో కమిట్ అయిన చిరు మరియు అల్లు అర్జున్…

మూవీస్ ని కాన్సిల్ చేశాడట. దాంతో ఇప్పుడు బోయపాటి చేతిలో అఫీషియల్ గా బాలయ్య మూవీ తప్పితే కొత్త సినిమాలేదు. ఆ సినిమా ఫేట్ పైనే టాలీవుడ్ లో బోయపాటి టాప్ హీరోల తో చేస్తాడా లేక చిన్న మీడియం రేంజ్ హీరోల తో పని చేస్తాడా అన్నది తేలనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here