ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ ఇదే!

0
259

    నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడి కాంబి నేషన్ లో వచ్చిన ప్రేస్టీజియస్ ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక ఫ్లాఫ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా రెండో పార్ట్ పై ఆ ప్రభావం గట్టిగా పడటం తో సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు అన్న వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

సినిమా లో చాలా మార్పులు చేర్పులు చేశారని అందుకే సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారనే వార్తలు చక్కర్లు కొట్టగా అవి కూడా కొంతవరకు నిజం అని తేలింది. ఇక సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే శివరాత్రి కానుకగా మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం

అని అంతా భావిస్తుండగా సడెన్ గా రిలీజ్ డేట్ విషయం లో మార్పు జరిగిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ మార్చి లో మొదలు అయ్యే అవకాశం ఉందని సమచారం. దాంతో ఇది పొలిటికల్ నేపధ్యంలో తెరకెక్కిన సినిమా అవ్వడం తో… ప్రచారానికి వాడుకుంటున్నారు అన్న

అపవాదు వచ్చే అవకాశం ఉండటం తో పాటు సినిమా ని నిలిపి వేసే అవకాశం కూడా ఉండటం తో రిలీజ్ డేట్ ని కొంచం త్వరగా నే ప్లాన్ చేయాలని డిసైడ్ అయిన యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ని ముందుకు జరిపారట. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు

ఈ నెల 22 నే రాబోతుందని సమాచారం. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది. మొదటి పార్ట్ మిగిలించిన భారీ నష్టాలను రెండో పార్ట్ ఎంతవరకు రికవరీ చేస్తుంది అన్నది ఇప్పుడు అందరి లోను ఎంతో ఆసక్తి రేపుతున్న ప్రశ్న గా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here