బాక్స్ ఆఫీస్ దగ్గర వాలెంటైన్స్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు పలు సినిమాలు రాగా వాటిలో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం చాలా టైం తర్వాత మేజర్ రోల్ చేసిన బ్రహ్మాఆనందం సినిమా ఒకటి కాగా…సినిమా కథ రెగ్యులర్ గానే ఉన్నా కూడా పల్లెటూరి నేపధ్యంలో కొన్ని డీసెంట్ సీన్స్ ఉండటంతో ఓవరాల్ గా టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో…
టాక్ ను ఈ సినిమా ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మిగిలిన కొత్త పాత సినిమాల మధ్య పోటిలో సినిమా వీకెండ్ లో మినిమమ్ ఇంపాక్ట్ అయితే చూపించింది అని చెప్పాలి. మొదటి రోజు 6 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను, రెండో రోజు 8 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అలాగే మూడో రోజున…
7.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకోగా టోటల్ గా వీకెండ్ లో సినిమా 21 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 45 వేల డాలర్స్ రేంజ్ లో వసూళ్ళని అందుకున్న సినిమా టోటల్ ఓవర్సీస్ లో 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…
తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ లో ఓవరాల్ గా 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా షేర్ ఒక 70 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో చాలా లిమిటెడ్ గానే షోలు పడగా షేర్ కూడా తక్కువగానే రిపోర్ట్ అయ్యింది. ఓవరాల్ గా సినిమా వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా…
90-95 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా గ్రాస్ 2 కోట్ల లోపు ఉండే అవకాశం ఉంది. సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 3.2 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…క్లీన్ హిట్ కోసం మరో 2.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకోవాల్సి ఉంటుంది…ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.