బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం ఇండియాలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రావడానికి సిద్దం అవుతుంది. పాన్ ఇండియా లెవల్ లో భారీ ప్రమోషన్స్ ని జరుపుకున్న ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా గా చెప్పుకోవాలి ఇప్పుడు. ఏకంగా 400 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1…
అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరుగా కొనసాగుతూ ఉండగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్ళని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మన దగ్గరలా బాలీవుడ్ లో సినిమాను కొనే బయ్యర్స్ ఎవరూ కూడా లేరు. సినిమాను చాలా వరకు పెర్సెంటేజ్ బేస్ మీదే…
రిలీజ్ చేస్తూ ఉంటారు. సినిమా ఓవరాల్ బడ్జెట్ లో శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ రైట్స్ పోనూ ఇంకా బడ్జెట్ ఎంత బాలెన్స్ ఉంది అన్నది సినిమా బిజినెస్ గా మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇక ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల రేంజ్ లో ఉండగా శాటిలైట్ డిజిటల్ అండ్ మ్యూజిక్ రైట్స్ అన్నీ కలుపుకుని…
ఆల్ మోస్ట్ 145-150 కోట్ల రేంజ్ రికవరీని సినిమా ఆల్ రెడీ సొంతం చేసుకుందని సమాచారం. ఇందులో అన్ని భాషల రైట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయని అంటున్నారు. ఇక ఓవర్సీస్ ఓవరాల్ బిజినెస్ 45 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన అమౌంట్ ని రికవరీ చేయాల్సి ఉంటుంది. అంటే సినిమా బిజినెస్ ఇప్పుడు అటూ ఇటూగా…..
200 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉండగా… ఇండియాలో అన్ని డబ్బింగ్ అండ్ హిందీ వర్షన్ కలుపుకుని ఈ సినిమా 400 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సినిమా ఇండియాలో హిట్ అవుతుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.