Home గాసిప్స్ ఎన్టీఆర్ దేవరలో ఈ పాటకి పూనకాలు ఖాయం అంటున్నారే!

ఎన్టీఆర్ దేవరలో ఈ పాటకి పూనకాలు ఖాయం అంటున్నారే!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ దేవర పార్ట్1(Devara Part1 Movie) అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అవ్వాల్సింది కానీ షూటింగ్ డిలే వలన పోస్ట్ పోన్ అయ్యి…

ఇయర్ ఎండ్ లో దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక సినిమా షూటింగ్ డిలే అవ్వడానికి కారణం అయిన సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) త్వరలో తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుండగా సినిమాకి మరో పెండింగ్ వర్క్ కూడా ఉందట…అదే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్(Anirudh) పాటలను కంప్లీట్ గా…

కంపోజ్ చేసి ఇవ్వక పోవడం కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేలా చేస్తుందని అంటూ ఉండగా రీసెంట్ గా సినిమా కోసం అనిరుద్ ఒక అద్బుతమైన పాటని ఇవ్వడంతో యూనిట్ మొత్తం ఫుల్ ఖుషి అయ్యారని టాక్ వినిపిస్తుంది. సినిమాలో ఆయుధాలకు పూజ చేసే ఒక సీన్ ఉంటుందని….ఆ సీన్ కి తగ్గట్లు….

ఒక అద్బుతమైన సాంగ్ అవసరం ఉండగా అనిరుద్ అందరి అంచనాలను మించేలా ఒక సాంగ్ ను ఇచ్చారని అంటున్నారు. ఆ సాంగ్ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేలా వచ్చిందని టాక్ వినిపిస్తూ ఉండగా ఇదే కనుక నిజం అయితే థియేటర్స్ లో ఈ సాంగ్ కి పూనకాలు ఖాయమని అంచనా వేయొచ్చు….

ఎన్టీఆర్-ఆయుధం అంటే అందరూ సింహాద్రి రేంజ్ సీన్ ని ఎక్స్ పెర్ట్ చేయడం ఖాయం…దేవర కి అలాంటి స్కోప్ ఎంతైనా ఉండటంతో సింహాద్రి రేంజ్ లో ఆ సాంగ్ రచ్చ చేస్తే థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఇక దేవర అక్టోబర్ 10న ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here