టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు రాగా సినిమా అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది.
సినిమా మొదటి వీకెండ్ లోనే చేతులు ఎత్తేయగా వర్కింగ్ డేస్ లోకి వచ్చిన తర్వాత ఒక్క ఇండిపెండెన్స్ డే హాలిడే రోజున మాత్రం మంచి కలెక్షన్స్ ని సాధించినా తర్వాత పూర్తిగా స్లో డౌన్ అయింది. ఇలాంటి సినిమా కి ఆంధ్రలో టికెట్ హైక్స్ కోసం…
అప్లై చేసినా కూడా బడ్జెట్ లెక్కలను అన్నీ చెప్పినా కూడా టికెట్ హైక్స్ పర్మీషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ లెక్కలు మాత్రం బయటికి వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం సినిమా కి గాను మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ ని పక్కకు పెడితే మాత్రం ఓవరాల్ గా…
సినిమా బడ్జెట్ లెక్క అందరినీ ఆశ్యర్యపరిచింది. ఏకంగా 101 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సినిమా నిర్మాణం అయ్యిందని ప్రభుత్వానికి ఇచ్చిన రిక్వెస్ట్ లో తెలిపారు…. కానీ ప్రభుత్వం వాళ్ళు అందులో కంప్లీట్ డీటైల్స్ దేనికి ఎంత ఖర్చు అయ్యిందో లాంటి వివరాలను అడగడంతో…
ఆ వివారాలను మేకర్స్ ఆన్ టైం కి ఇవ్వలేక పోవడంతో సినిమా కి టికెట్ హైక్స్ రాలేదు. సినిమా కి టికెట్ హైక్స్ ఉండి ఉంటే ఓపెనింగ్స్ లో ఇంకొంచం హెల్ప్ అయ్యేదేమో కానీ కలెక్షన్స్ పరంగా సినిమా టాక్ దెబ్బ కొట్టడంతో లాంగ్ రన్ లో ఏమాత్రం హెల్ప్ అయ్యేది కాదనే చెప్పాలి. మొత్తం మీద ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవ్వడం ఏంటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో అనుకుంటున్నారు….